Bandi Sanjay Tweet On KCR Health: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అన్ని రిపోర్టులు నార్మల్ గానే ఉన్నాయని ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉందని అప్పుడు కానీ స్పష్టత ఇవ్వలేమని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన అమ్మవారి కృప వల్ల కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
రెండు రోజులుగా ఎడమ చేయి, కాలు లాగుతున్నాయని, నీరసంగా ఉందని సీఎం సూచించడంతో శనివారం యశోదలో చేరారు. మామూలుగానే నడుచుకుంటూ వచ్చి ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కానీ ఆయన ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు.
Also Read: గోవాలో గెలుపు వెనుక మన తెలుగు నేత
కేసీఆర్ వారం పాటు చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో తీసుకున్నా ఆస్పత్రిలో తీసుకున్నా ఫర్వాలేదు కానీ చికిత్స మాత్రం తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. మరి కాసేపట్లో ఆస్పత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. కేసీఆర్ అనారోగ్యంపై అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ కు గతంలో ఏఅనారోగ్య లక్షణాలు లేకున్నా ఒక్కసారిగా ఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశం అవుతోంది.
ప్రస్తుతం బీపీ, షుగర్, యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించిన అన్ని రిపోర్టులు వచ్చాయి. అన్నింట్లో నార్మల్ గానే రిపోర్టులు సూచిస్తున్నాయి. కానీ చేయి, కాలు లాగడంపై వైద్యులు ఇంకా కొన్ని పరీక్షలు చేస్తున్నారు. త్వరలో రిపోర్టులు పరిశీలించి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి వివరించనున్నారు. అన్ని రిపోర్టులు వచ్చాక వ్యాధి నిర్ధారించుకుని వెల్లడించే అవకాశం ఏర్పడింది. దీంతో ఆస్పత్రికి పలువురు వచ్చి పరామర్శిస్తున్నారు.
Also Read: తర్వాత టార్గెట్ ఆ రెండు రాష్ట్రలే.. మోడీ వ్యూహం మొదలెట్టేశారు