పరువు హత్యకు గురైన హేమంత్ మర్డర్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 18 మంది నిందితులతో పాటు మరో ఇద్దరు ఉన్నారంటూ అవంతి ఆరోపణలు చేసింది. తాజాగా.. అవంతికి ఆమె తల్లిదండ్రుల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఏకంగా పోలీసుల ముందే హెచ్చరికలు వచ్చాయి. ‘మీరెలా బతుకుతారో చూస్తాం’ అంటూ హెచ్చరించారు.
Also Read: మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడితె క్రిమినల్ చర్యలు..
అవంతి అప్పట్లో హేమంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వెంటనే ఈ జంట పోలీసుల భద్రత కోరింది. ఈ మేరకు అవంతి జంటకు భద్రత కల్పించాలని, వారి పేరెంట్స్‌కు కౌనెసలింగ్ నిర్వహించాలని సీపీ చెప్పినా కొందరు పోలీసులు నిర్లక్ష్యం చేశారు. దీంతో ఇప్పుడు చందానగర్ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నారు. సీపీ చెప్పినా నిర్లక్ష్యం వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే.. హేమంత్ ఇలా చావుకు గురికావాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు.
కౌన్సెలింగ్ కోసం పెళ్లయిన వారం రోజులకే అవంతి, హేమంత్‌ను పోలీసులు పిలిచారు. అవంతి పేరెంట్స్‌ను కూడా పిలిపించారు. అయితే.. కౌన్సెలింగ్‌లోనూ పోలీసులు అవంతి పేరెంట్స్‌కు సపోర్టు చేశారని సమాచారం. అంతేకాదు.. పోలీసుల ముందే హేమంత్, అతని పేరంట్స్‌ను లక్ష్మారెడ్డి, అర్చన, యుగేంధర్‌రెడ్డి తిట్టారు. కానీ పోలీసులు మాత్రం ఆపలేదు. పైగా వారికే మద్దతిచ్చారు. ఎలా జీవిస్తారో చూస్తామని బెదిరించగా.. తమకు ప్రాణహాని ఉందంటూ హేమంత్ ఫ్యామిలీ అదే రోజు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని అప్పుడే భద్రత కల్పిస్తే హేమంత్ చనిపోయే వాడు కాదని అతని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ తమకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయని.. తమకు న్యాయం చేయాలని.. మంగళవారం మరోసారి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలుస్తామని అవంతి తెలిపారు. సీపీని కలిశాక తదుపరి కార్యాచరణను తెలియజేస్తామని హేమంత్ సోదరుడు సుమంత్ వెల్లడించారు.
Also Read: కొత్త రూల్స్: రోడ్డు ఎక్కేముందు తప్పక తెలుసుకోండి
కాగా.. హేమంత్ మృతిపై పోలీసులు తమ విచారణను ముమ్మరం చేశారు. ఔటర్‌రింగ్ రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి, జహీరాబాద్ వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. హేమంత్ హత్య కేసులో 18 మంది పాల్గొన్నారని భావించారు. కానీ.. అవంతి అన్నయ్య ఆశిష్‌రెడ్డి, బంధువు సందీప్‌రెడ్డి, మరో ఐదుగురు వ్యక్తుల పాత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితులు లక్ష్మారెడ్డి, అర్చన, యుగేంధర్‌రెడ్డితోపాటు.. సుపారి హంతకుడు బిచ్చూయాదవ్‌ను మంగళవారం పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.