లాక్ డౌన్ 5.0లో కట్టింగ్ షాప్ లో టవల్ రూల్?

ఈనెల 31 కి నాలుగో దశ లాక్‌ డౌన్ ముగియనుండటంతో లాక్ డౌన్ 5.0పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ నాలుగో దశ లాక్ డౌన్ లో ప్రభుత్వాలు ఎన్నో సడలింపులు ఇచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తప్ప అన్ని దుకాణాలు తెరచుకున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత ఇటీవలే హెయిర్ సెలూన్లు కూడా ఓపెన్ అయ్యాయి. అయితే అన్ని షాపుల్లో భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. అయితే […]

Written By: Neelambaram, Updated On : May 28, 2020 8:25 pm
Follow us on

ఈనెల 31 కి నాలుగో దశ లాక్‌ డౌన్ ముగియనుండటంతో లాక్ డౌన్ 5.0పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ నాలుగో దశ లాక్ డౌన్ లో ప్రభుత్వాలు ఎన్నో సడలింపులు ఇచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తప్ప అన్ని దుకాణాలు తెరచుకున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత ఇటీవలే హెయిర్ సెలూన్లు కూడా ఓపెన్ అయ్యాయి. అయితే అన్ని షాపుల్లో భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా యంత్రాంగం మరిన్ని కఠిన నిబంధనలు విధించారు. బార్బర్ షాప్‌ కు వెళ్లే కస్టమర్లు ఎవరి టవల్ వారే తీసుకెళ్లాలి. అంతేకాదు ప్రతి బార్బర్ షాప్ నిర్వాహకుడు కత్తెరలు, దువ్వెనలు, హెయిర్ బ్రష్‌లును శానిటైజ్ చేయాలి. షాప్‌ లో కస్టమర్లు మూడు అడుగుల భౌతిక దూరం పాటించాలి.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్5.0 లో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.