
మరికొద్ది రోజుల్లోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలపై అక్కడి ప్రతిపక్ష లీడర్ చంద్రబాబులో భారీగా ఆశలు కనిపిస్తున్నాయి. ఆయన అనుకున్నట్లుగానే పంచాయతీ ఎన్నికలు ముందుగానే జరిగిపోయాయి. సరే ఆ ఫలితాలు ఎలా ఉన్నా సంబంధం లేదనుకోండి..! కానీ.. ఆ రిజల్ట్ మాత్రం తిరుపతి లోక్‌సభపై ఉంటుందా లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చ నడుస్తోంది. అందుకే.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు నేతలను సన్నద్ధం చేస్తున్నారు. నిత్యం వీడియో కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
Also Read: పోలీసులతోనే దండాలు.. చంద్రబాబు ప్లాన్ పారలేదుగా?
తిరుపతి ఉప ఎన్నికలో చంద్రబాబుకు గెలుపు ఎంతగానో అవసరం. జగన్ దూకుడును అడ్డుకోవాలంటే తిరుపతి ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని చంద్రబాబు నమ్ముతున్నారు. మరోవైపు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో ప్రత్యేకంగా ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మను వినియోగిస్తున్నారంటే చంద్రబాబు ఈ ఎన్నికను ఎంత ప్రిస్టేజియస్‌గా తీసుకున్నారో చెప్పకనే తెలుస్తోంది.
మరోవైపు.. రాబిన్ శర్మ బృందం ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సర్వే నివేదికలను చంద్రబాబుకు అందించినట్లు తెలిసింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో శ్రీకాళహస్తి మినహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుందన్న నివేదిక ఇచ్చిందంట. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వైసీపీ పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లోనూ కొంత వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై కనిపిస్తోందని రాబిన్ శర్మ టీం ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
Also Read: షర్మిల రాకపై రేవంత్ ఎందుకు భయపడుతున్నాడు?
దీంతో అధినేత చంద్రబాబులో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగింది. తిరుపతి ఉప ఎన్నిక కోసం ఇప్పటికే మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించారు. ప్రత్యేకంగా వార్ రూమ్‌ను కూడా చంద్రబాబు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అవసరమైతే తాను తిరుపతిలోనే మకాం వేస్తానని కూడా చంద్రబాబు నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా వ్యూహకర్త రాబిన్ శర్మ టీం ఇచ్చిన నివేదికతో చంద్రబాబులో ఆశలు మొలకెత్తాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్