https://oktelugu.com/

Delhi New CM: ఢిల్లీ సీఎం ఎంపికపై ట్విస్ట్‌.. మరో రెండు రోజులు అదే ఉత్కంఠ..!

దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేయాలన్న 27 ఏళ్ల బీజేపీ(BJP) లక్ష్యం నెరవేరింది. తాజా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే మహారాష్ట్ర(Maharashtra) తరహాలోనే ఢిల్లీ సీఎం ఎంపికలో జాప్యం చేస్తోంది.

Written By: , Updated On : February 17, 2025 / 12:35 PM IST
Delhi New CM

Delhi New CM

Follow us on

Delhi New CM: దేశ రాజధాని ఢిలీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న బీజేపీ కల 27 ఏళ్లకు నెరవేరింది. చివరి బీజేపీ ముఖ్యమంత్రిగా సుష్మాస్వరాజ్‌ పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో బీజేపీకి అవకాశం దక్కలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లిన కమలం పార్టీ.. ఆప్‌(AAP)అవినీతి, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్‌ అయింది. దీంతో 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 48 స్థానాలు గెలుచుకుంది. అధికార ఆప్‌ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్‌(Congress) ఈసారి కూడా ఖాతా తెరవలేదు. స్పష్టమైన మెజారిటీ సాధించినా సీఎం ఎంపికలో బీజేపీ జాప్యం చేస్తోంది. సోమవారం బీజేపీ కీలక సమావేశం ఉంటుందని, సీఎంను ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో సమావేశం వాయిదా వేస్తూ బీజేపీ ట్విస్ట్‌ ఇచ్చింది. తిరిగి ఫిబ్రవరి 19న సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు సీఎం ఎంపికతోపాటు కేబినెట్‌ ఎంపికపై ప్రకటన ఉంటుందని సమాచారం. సమావేశం తర్వాత ఎమ్మెల్యేలె లెఫ్టినెంట్‌ గవర్నర్‌(Leftnent Governar) వద్దకు వెళ్లి బీజేపీ ఎల్పీ నేత, కేబినెట్‌ పేర్లు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు.

జాప్యానికి కారణం ఇదే..
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి ఘన విజయం సాధించింది. అయితే సీఎం ఎంపికలో దాదాపు పక్షం రోజుల సమయం తీసుకుంది. ఏక్‌నాథ్‌షిండే, ఫడ్నవీస్‌ మధ్య పోటీ నేపథ్యంలో షిండేను ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు షిండే లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. చివరి నిమిషంలో షిండె వెనక్కి తగ్గడంతో ఫడ్నవీస్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఢిల్లీ(Delhi)లో అలాంటి పరిస్థితి లేకపోయినా సీఎం ఎంపికలో బీజేపీ అధిష్టానం జాప్యం చేస్తోంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడ్డాయి. అయితే సీఎం ఎంపిక విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. జేపీ నడ్డా నాయకత్వంలో జాతీయ అధిష్టానం అంతర్గత సంప్రదింపులు కూడా జరిపింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా(America) పర్యటనకు వెళ్లారు. దీంతో ఎంపిక ఆలస్యైంది. సోమవారం ఢిల్లీలో భూప్రకంపనలతో సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈనెల 19న సీఎం పదవితోపాటు, మంత్రి పదవుల కేటాయింపు కూడా పూర్తి చేస్తారని సమాచారం. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు పార్టీ జాతీయ కార్యదర్శులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. బీజేపీ పాలిత ప్రాంతాల తరహాలోనే ఢిల్లీలో కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని సమాచారం.

ప్రమాణం ఎప్పుడంటే..
ఫిబ్రవరి 20న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. దీనికి మోదీ, అమిత్‌షాతోపాటు బీజేపీ అగ్రనేతలు హాజరవుతారు. సీఎం, మంత్రివర్గ ప్రమాణస్వీకరాం ఒకేసారి ఉంటుంది. ఈమేరక కార్యక్రమ కోఆర్డినేటర్లుగా వినోద్‌ తాళ్తే, తరుణ్‌ చుగ్‌ను బీజేపీ హైకమాండ్‌ నియమించింది. ఇదిలా ఉంటే సీఎం రేసులో సర్వేష్‌వర్మ(న్యూ ఢిల్లీ), రేకా గుప్తా,(షాలిమార్‌ బాగ్‌), విజేందర్‌ గుప్తా(రోహిణి), సతీశ్‌ ఉపాధ్యాయ్‌(మాల్వియా నగర్‌), ఆశిష్‌ సూద్‌(జనక్‌పురి), పవన్‌ శర్మ(ఉత్తమ్‌ నగర్‌), అజయ్‌ మహావార్‌(ఘోండా) పేర్లు వినిపిస్తున్నాయి. క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న నేతకే ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది.