Mahesh Babu , Rajamouli
Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టే సినిమాలను కూడా చేశాడు. ఇక ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో మరోసారి భారీ రేంజ్ లో తన సత్తాను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు…
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu) సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం ఏదైనా కూడా వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకి మంచి గుర్తింపైతే ఉంది. పాన్ వరల్డ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచం మొత్తాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక వీళ్లిద్దరూ కూడా ఈ సినిమాలోనే లీనమైపోయి సినిమా కోసమే కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంటర్వెల్ సీన్ లో రాజమౌళి ఒక భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా మొత్తం అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతుంది కాబట్టి మహేష్ బాబు ఒక్కొక్క టాస్క్ ను దాటుకుంటూ ముందుకు సాగుతాడట. ఇక నిధి వేటలో తనకు నిధి దక్కాలంటే కొన్ని టాస్క్ లను దాటడమే కాకుండా ఆయన చాలా మంది రౌడీలతో కూడా పోరాటం చేయాల్సి ఉంటుందట. సరిగ్గా ఇంటర్వెల్ కి ముందు నరరూప రాక్షసులుగా పిలవబడే కొంతమందితో మహేష్ బాబు ఫైట్ చేసి నిధిని దక్కించుకుంటాడట…ఇక అతనికి తన వెనకాల ఉండేవాడు వెన్నుపోటు పొడిచే విధంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఉంటుందట.
మరి ఎవరినైతే తనతో పాటు తీసుకెళ్తాడో వాళ్లే అతనికి శత్రువులుగా మారుతారని నిధి కోసం దొంగ దారులు తొక్కే ప్రయత్నం చేస్తారని తద్వారా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అద్భుతంగా ఉండబోతుందని రాజమౌళి తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద వస్తున్న అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
రాజమౌళి మాత్రం ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లీక్ ని కూడా బయటికి రిలీజ్ చేయడం లేదు. మరి ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి సినిమా ఇప్పటివరకు మంచి విజయాలను సాధిస్తూ వచ్చాయి. ఇకమీదట చేయబోయే సినిమాలో కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించాలంటే మాత్రం అంతకంతకు కష్టపడుతూ ముందుకు సాగాల్సిన అవసరం కూడా ఉంది…
ఇక ఏది ఏమైనా ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాలన్నింటి కంటే కూడా ఆయన ఈ సినిమా కోసం డబుల్, త్రిబుల్ కష్టపడుతున్నాడట. మరి పాన్ వరల్డ్ లో రాజమౌళి చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు గెలుస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…