Chiranjeevi , Venkatesh
Chiranjeevi and Venkatesh : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలతో మరో మెట్టు పైకి ఎక్కబోతున్నాడనేది వాస్తవం…మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు వచ్చిన సూపర్ హిట్ లవ్ స్టోరీని చిరంజీవి చేయాల్సింది. కానీ ఆ మూవీని వెంకటేష్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడనే విషయంలో మనలో చాలా మందికి తెలియదు. వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమించుకుందాం రా(Preminchukundam Raa)… సినిమాని మొదట చిరంజీవి చేయాల్సిందట. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆ సినిమా దర్శకుడు అయిన జయంత్ సి పరంజీ (Jayanth C Paranji) ఆ సినిమాను వెంకటేష్ తో చేశాడు. ముందుగా అల్లు అరవింద్ ద్వారా ఆ కథ చిరంజీవి దగ్గరికి వచ్చింది.
లవ్ స్టొరీ లో చిరంజీవి చేయడానికి కొంతవరకు సతమతమైనప్పటికి ఫైనల్ గా చేస్తాను అని చెప్పే క్రమంలోనే ఆ కథ వెంకటేష్ దగ్గరికి వెళ్లి అతను ఓకే చెప్పాడు. ఇక మొత్తానికైతే ఒక మంచి లవ్ స్టోరీని మెగాస్టార్ చిరంజీవి మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. నిజానికి చిరంజీవి కంటే కూడా ఆ సినిమా వెంకటేష్ కే బాగుందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు.
మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి అన్ని జనర్స్ సినిమాలను చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడు. కెరియర్ మొదట్లో డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగిన చిరంజీవి ఇప్పుడు మాత్రం కేవలం కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి ఆయన వెనకడుగు వేస్తుండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా సక్సెస్ లు ఇక్కడ కీలకపాత్ర వహిస్తూ ఉంటాయి. కాబట్టి సక్సెస్ రావడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇచ్చే విధంగా 18 గంటల పాటు కష్టపడుతున్నాడు అంటే మామూలు విషయం కాదు…చిరంజీవి ఎప్పుడు కమర్షియల్ సినిమాలను ఎందుకు చేస్తున్నాడు. డిఫరెంట్ సినిమాలను ఎందుకు చేయడం లేదనే ధోరణిలో ఒక వర్గం వారు చిరంజీవి మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. నిజానికి చిరంజీవి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ చిరంజీవి అలాంటి సినిమాలు చేసిన ప్రతిసారి ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. అందుకే చిరంజీవి కమర్షియల్ సినిమాలను నమ్ముకున్నాడు…