కొత్త ఆదేశం: వ్యాక్సిన్ తీసుకుంటే నో సెక్స్?

కరోనా మహమ్మారి తరిమికొట్టే ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సిన్. దీనిని తీసుకునేందుకు ప్రజలు ముందుగా వెనుకడుగు వేశారు. కానీ అవగాహన కల్పించడంతో పాటు సత్ఫలితాలు కూడా ఇవ్వడంతో వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. ఇక ఇండియాలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అయితే ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా వ్యాక్సిన్ తీసుకువచ్చిన రష్యా వ్యాక్సిన్ తరువాత కొన్ని సూచనలు చేస్తోంది. ప్రస్తుతం రష్యాలో స్పుత్నిక్ ను వేస్తున్నారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు రాలేదు. కానీ […]

Written By: NARESH, Updated On : July 12, 2021 8:34 am
Follow us on

కరోనా మహమ్మారి తరిమికొట్టే ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సిన్. దీనిని తీసుకునేందుకు ప్రజలు ముందుగా వెనుకడుగు వేశారు. కానీ అవగాహన కల్పించడంతో పాటు సత్ఫలితాలు కూడా ఇవ్వడంతో వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. ఇక ఇండియాలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అయితే ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా వ్యాక్సిన్ తీసుకువచ్చిన రష్యా వ్యాక్సిన్ తరువాత కొన్ని సూచనలు చేస్తోంది. ప్రస్తుతం రష్యాలో స్పుత్నిక్ ను వేస్తున్నారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు రాలేదు. కానీ చాలా దేశాల్లో స్పుత్నిక్ ను ఇస్తున్నారు.

ప్రస్తుతం స్పుత్నిక్ రెండు డోసులు ఇస్తున్నారు. త్వరలో ఒకే డోసు ఇచ్చే దానిని తీసుకురానున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఏం చేయాలి..? ఏం చేయకూడదని చాలా మందిలో ఇప్పటికీ అనుమానాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి ప్రభుత్వం టీకా వేసుకున్న తరువాత శారీరకంగా ఎలాంటి పనులు చేయొద్దని సూచిస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారు మూడు రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఉండాలని రష్యా ఆరోగ్య ఉప మంత్రి డెవిస్ గ్రైఫర్ తెలిపారు.

సాధారణంగా సెక్స్ వల్ల ఎనర్జీయే వస్తుంది. కానీ స్పుత్నిక్ వేసుకున్న తరువాత ఎలాంటి శారీరక శ్రమ ఖర్చు చేయకూడదట. అంతేకాకుండా వోడ్కా, సిగరెట్లు కూడా కొన్ని రోజుల పాటు ముట్టకుండా ఉండాలంటున్నారు. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ విషయంలో సాధారణ ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదు. కొత్తగా ఇలాంటి నిబంధనలు పెడితే టీకా తీసుకోవడానికి ఆసక్తి చూపరని కొందరంటున్నారు. ఇదిలా ఉండగా రష్యా ఇప్పటి వరకు కేవలం 13 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చింది.