Vice President Election: ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో ఇండియా కూటమికి పెద్దగా ఆశలు లేవు. కాకపోతే ఏకపక్షం కాకుండా పోటీ ఇవ్వాలనేదే ఆ కూటమి అసలు ఉద్దేశం. అందువల్లే రేవంత్ చెప్పిన మాటకు రాహుల్ తల ఊపాడు. ఇండియా కూటమిలో పెద్దలను కూడా ఒప్పించాడు. దీంతో రేవంత్ పరపతి జాతీయస్థాయిలో పెరిగింది. ఇది సహజంగానే గులాబీ పార్టీకి నచ్చదు కాబట్టి ఓటింగ్ కు దూరంగా ఉంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినప్పటికీ.. రాజ్యసభ ప్రకారం నాలుగు ఓట్లు గులాబీ పార్టీకి ఉన్నాయి. కాకపోతే ఓటింగ్ కు దూరంగా ఉండి పరోక్షంగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసింది. మీదికేమో మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే సభార్డినేట్ అంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ పార్టీ మరింత ప్రజాస్వామ్య పార్టీగా రూపాంతరం చెందుతోంది.
Also Read: ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన ఓటింగ్..సుమన్ శెట్టి,సంజన సేఫ్..డేంజర్ జోన్ లో ఊహించని కంటెస్టెంట్స్!
సుదర్శన్ రెడ్డి మీద అమిత్ షా చేసిన ఆరోపణలు ఒక్కసారిగా జాతీయస్థాయిలో ప్రచారానికి నోచుకున్నాయి. దీనికి తోడు సుదర్శన్ రెడ్డి సల్వాజుడుం మీద తాను ఇచ్చిన తీర్పును మరోసారి విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. తద్వారా నక్సలైట్లకు ఇండియా కూటమి పాజిటివ్ అనే సంకేతాన్ని బలంగా తీసుకెళ్లారు. అయితే ఇది కొంతమంది కమ్యూనిస్టులకు.. మరి కొంతమందికి నచ్చవచ్చు గాని.. అంతిమంగా ఓట్లను కురిపించే మంత్రంగా మాత్రం మారలేకపోయింది. అటు రాజ్యసభలో.. ఇటు పార్లమెంట్లో ఎన్డీఏకు బలం ఉంది కాబట్టి రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడక అయింది. కానీ ఇక్కడే ఇండియా కూటమి పప్పులో కాలు వేసింది. రాధాకృష్ణన్ గెలుపు తర్వాత.. లెక్కించిన ఓట్లలో ఈ విషయం బయటపడింది.
ఆత్మ ప్రబోధానుసారం అని అంటే..
వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రచారంలో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైనది ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఓటర్లకు ఆయన ఇచ్చిన పిలుపు.. ఆ పిలుపు ఆయన విజయానికి కాకుండా ఎన్ డి ఏ అభ్యర్థి బలాన్ని మరింత పెంచింది. రాధాకృష్ణన్ కు 19 ఓట్లు అదనంగా పడ్డాయట. అంతేకాదు 15 ఓట్లు చెల్ల లేదట. ఇదే విషయాన్ని ఓట్ల లెక్కింపు తర్వాత బయటపెట్టారు. వాస్తవానికి పార్లమెంట్, రాజ్యసభ కలిపి సభ్యులకు మొత్తం 786 ఓట్లు ఉన్నాయి. ఇందులో భారత రాష్ట్ర సమితి ఓటింగ్లో పాల్గొనేది కాబట్టి.. 782 మంది అభ్యర్థులు మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం 394 ఓట్లు వచ్చిన వారు గెలిచినట్టు లెక్క.. ఇప్పటికే ఎన్డీఏకు 425.. ఇండియాకుటమికి 324 మంది సభ్యులు ఉన్నారు. కానీ లెక్కింపు తర్వాత ఎన్డీఏ అభ్యర్థికి అదనంగా 19 ఓట్లు వచ్చాయి. దారుణమైన విషయం ఏంటంటే 15 ఓట్లు చెల్లలేదు. దీనినిబట్టి ఇండియా కూటమి ఆత్మ ప్రబోధానుసారం ఆత్మ విమర్శ చేసుకోవాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.