Dussehra Holidays In AP: ఏపీలో( Andhra Pradesh) విద్యార్థులకు గుడ్ న్యూస్. దసరా సెలవులు విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు అకడమిక్ క్యాలెండర్ బట్టి దసరా సెలవులు కేవలం తొమ్మిది రోజులే. అయితే తాజాగా 12 రోజులపాటు దసరా సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి సైతం ప్రత్యేక విజ్ఞప్తులు వెళుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వంపై ఏర్పడినట్లు సమాచారం. తెలంగాణలో ఈనెల 21 నుంచి సెలవులు ప్రారంభం కానుండడంతో.. ఏపీలో సైతం అదే తేదీ నుంచి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఏదో ఒక నిర్ణయం రావచ్చని తెలుస్తోంది.
Also Read: ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన ఓటింగ్..సుమన్ శెట్టి,సంజన సేఫ్..డేంజర్ జోన్ లో ఊహించని కంటెస్టెంట్స్!
* 22 నుంచి సెలవులు?
ఈనెల 22 నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఈనెల 24 నుంచి సెలవులు ప్రకటించింది. అయితే ఈ నెల 21న ఆదివారం పడుతోంది. 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అదే జరిగితే విద్యార్థులకు 12 రోజులపాటు దసరా సెలవులు( Dussehra holidays ) వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఎమ్మెల్సీ గోపి మూర్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో దసరా సెలవులను మార్చాలని కోరారు. ఈనెల 22 నుంచి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పండుగ ప్రారంభం అవుతున్న దృష్ట్యా తెలంగాణ మాదిరిగా సెలవులు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో దసరాకు అత్యంత ప్రాధాన్యం ఉంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలోనే అక్కడ సెలవులు ముందుగానే ప్రకటించారు. ఏపీ కంటే అధిక సెలవులు ఇచ్చారు.
* ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం..
దసరా సెలవులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా దసరా అంటే అందరూ ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. సుదూర ప్రాంతాల్లో ఉండే స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అందుకే దీనిపై ఒక ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ గోపి మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ పరిశీలన చేసే అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల గురించి సైతం ఎమ్మెల్సీ ప్రస్తావించారు. మెగా డీఎస్సీ నియామకాల కంటే ముందే అంతర్ జిల్లా బదిలీలు పూర్తి చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు చేపట్టాలని కోరారు. హై స్కూల్ ప్లస్ లోని పీజీటీలను స్కూల్ అసిస్టెంట్ల ద్వారానే భర్తీ చేయాలని కోరారు. డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులకు బదిలీలు చేయాలని కూడా ఎమ్మెల్సీ గోపి మూర్తి విజ్ఞప్తి చేశారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.