Bigg Boss 9 Telugu Voting Results: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు. కేవలం ఒకే ఒక్క సందర్భం మొత్తం గ్రాఫ్ నే మార్చేస్తుంది. ఈ సీజన్ మొదలై కేవలం రెండు రోజులే అయ్యింది. కానీ ఆడియన్స్ దృష్టిలో కంటెస్టెంట్స్ మీద అభిప్రాయాలు నిన్న ఒక్క ఎపిసోడ్ తోనే మారిపోయింది. అదే బిగ్ బాస్ గేమ్ అంటే. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో సుమన్ శెట్టి చాలా డల్ గా ఉన్నాడు. వయస్సులో కూడా పెద్ద, టాస్కులు ఆడలేడేమో, ఇతనికి ఆడియన్స్ ఓటింగ్ పడదు అని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఇతనికి భారీ ఓటింగ్ పడింది. అందుకు కారణం ఆడియన్స్ లో ఈయన మంచి మనిషి అనే ముద్ర వేసుకోగలిగాడు, అదే సమయం లో తాను అనుకున్నంత సైలెంట్ కాదు, టైం వస్తే ఇచ్చి పారేస్తాడు అని నిన్న నామినేషన్స్ టైం లో సంజన కి కౌంటర్ ఇచ్చినప్పుడు అందరికీ అర్ధమైంది.
Also Read: ఒక్క పంచ్ తో సంజన నోరు మూయించిన సుమన్ శెట్టి..సైలెంట్ గా కనిపిస్తాడు కానీ!
దీంతో సుమన్ శెట్టి ఓటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఓటింగ్ లో ఇతను టాప్ 3 స్థానం లో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల్లో ఇమ్మానుయేల్ మరియు తనూజ గౌడ ఉన్నారు. వీళ్లిద్దరికీ దాదాపుగా సరిసమానమైన ఓటింగ్ పడుతుంది. అయితే మొదటి రెండు రోజుల్లో సంజన బాగా నెగటివ్ అయ్యింది కదా, ఈమె ఎలిమినేట్ అయిపొతుందెమో అని అంతా అనుకున్నారు. కానీ ఈమెకు కూడా ఓటింగ్ ఒక మోస్తరుగా బాగానే పడుతుంది. ఎలిమినేట్ అయ్యే రేంజ్ లో అయితే ప్రస్తుతం ఆమె ఓటింగ్ లేదు. ఇక 4 , 5 మరియు 6వ స్థానాల్లో రీతూ చౌదరి, డిమోన్ పవన్ మరియు రాము రాథోడ్ ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే ఫ్లోరా షైనీ, శ్రేష్టి వర్మ. ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం అయితే శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిపోతుంది.
ఫ్లోరా షైనీ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రేష్టి వర్మ హౌస్ లో ఉండడం ముఖ్యమే, ఆమె కారణంగా భవిష్యత్తులో కంటెంట్ రావొచ్చు, కానీ ఫ్లోరా షైనీ మాత్రం హౌస్ కి ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది. చాలా సున్నితమైన వ్యక్తి లాగా అనిపిస్తుంది. హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ తో పోరాడి నిలవడం చాలా కష్టమే, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఘోరమైన సందర్భాలను ఎదురుకోవాల్సి వస్తుంది,వాటిని తట్టుకోవడం ఆమెకు దాదాపుగా కష్టమే. కాబట్టి ఈ వీకెండ్ ఆమెకు సేఫ్ అయ్యేంత ఓటింగ్ పడినా కూడా బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.