https://oktelugu.com/

NPS Scheme: పిల్లలకు గుడ్ న్యూస్.. వేలు కడితే ఈ స్కీమ్ ద్వారా కోట్లలో సొమ్ము!

కేంద్ర ప్రభుత్వం చిన్న పిల్లల కోసం కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య పథకం అనే కొత్త పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద చిన్న వయస్సులోనే పెట్టుబడి పెడితే.. రిటైర్‌మెంట్ అయిన తర్వాత భారీ మొత్తంలో డబ్బు వస్తుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 20, 2024 / 09:39 AM IST

    NPS Vatsalya Scheme

    Follow us on

    NPS Scheme: కేంద్ర ప్రభుత్వం చిన్న పిల్లల కోసం కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య పథకం అనే కొత్త పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద చిన్న వయస్సులోనే పెట్టుబడి పెడితే.. రిటైర్‌మెంట్ అయిన తర్వాత భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పెద్దయిన తర్వాత ఎక్కువ డబ్బు పొందవచ్చు. మైనర్లుగా ఉన్న పిల్లల పేరుతో తల్లిదండ్రులు ఇందులో ఒక అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. మీకు దగ్గరగా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు దగ్గర ఈ స్కీమ్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. మైనర్‌గా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తారు. ఆ తర్వాత వారే స్వయంగా అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తారు. ఈ పథకంలో నెలకు కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా మీకు ఎంత నచ్చితే అంత పెట్టుకోవచ్చు. ఇలా ప్రతీ ఏటా కట్టడం వల్ల 60 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ వస్తుంది.

    ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే?
    ఈ స్కీమ్‌లో ఆన్‌లైన్ ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎన్‌పీఎస్ వాత్సల్య అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ మెయిల్స్ పూర్తి డిటైల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. ఆ తర్వాత కూడా మీకు నచ్చినంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే కొందరు వెయ్యి రూపాయిలు పెడితే, మరికొందరు పదివేలు పెడుతుంటారు. ఈ అమౌంట్ ఏడాదికి పెట్టుబడి పెట్టడం వల్ల మీకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్‌లో దాదాపుగా రూ.10 వేలు పెట్టుబడి పెడితే మీకు 60 ఏళ్ల తర్వాత మొత్తం ఒక రూ.11 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. మీకు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటే అంత పెట్టవచ్చు.

    ఈ స్కీమ్‌లో చేరడం వల్ల భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది. కనీసం ఏడాదికి ఒక రూ.5000 అయిన ఇన్వెస్ట్ చేయడం వల్ల కనీసం రూ.6 కోట్లు అయిన భవిష్యత్తులో వస్తుంది. అయితే ఈ స్కీమ్‌లో చేరిన 18 ఏళ్ల తర్వాత కూడా ఈ డబ్బును తీసుకోవచ్చు. కేవలం 60 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చే వరకు మాత్రమే వెయిట్ చేయక్కర్లేదు. ఆ తర్వాత కూడా మీకు అకౌంట్ కొనసాగించాలంటే చేయవచ్చు. లేదంటే అక్కడితో ఆపేయవచ్చు. పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఇలాంటి స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా డబ్బను దాచడం వల్ల పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఇలాంటి ప్రభుత్వ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.