Indian Railway: దూర ప్రయాణాలు చేయాలంటే దేశంలో ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు. రైళ్లలో ప్రయాణాలు చేయడం వల్ల సురక్షితంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఎక్కడికైనా వెళ్లాలంటే ఒక నెల లేదా రెండు నెలల ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. లేకపోతే అసలు టికెట్లు దొరకవు. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఇలా టికెట్లు దొరక్కపోవడం, ఎక్కువ డబ్బులు పెట్టి ఏసీలో వెళ్లలేక చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ జనరల్ కోచ్‌లో వెళ్తుంటారు. ఇలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న రైళ్లకు అదనంగా జనరల్ కోచ్‌లను యాడ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ నవంబర్ చివరికి అదనంగా రైళ్లకు జనరల్ కోచ్‌లను యాడ్ చేయనుంది.
దేశ వ్యాప్తంగా మొత్తం 370 రైళ్లకు వెయ్యికి పైగా ఎక్స్‌ట్రా కోచ్‌లను యాడ్ చేయనుంది. వచ్చే మూడు నెలల్లో 600కి పైగా జనరల్ కోచ్‌లను అనుసంధానం చేయనుంది. ఇలా జనరల్ కోచ్‌లను పెంచడం వల్ల ఎందరో ప్రయాణికుల ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. దీనివల్ల ఎక్కువ ఖర్చు పెట్టి ప్రయాణించలేని మధ్య తరగతి వారికి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వీటితో పాటు వచ్చే రెండేళ్లలో నాన్ ఏసీలో కూడా పదివేల కంటే ఎక్కువగా కోచ్‌లను యాడ్ చేయనున్నారు. ఇలా జనరల్ కోచ్‌లను పెంచడం వల్ల రోజుకి దాదాపుగా 8 లక్షల మంది ఎక్స్‌ట్రాగా ప్రయాణించగలరని రైల్వే శాఖ తెలుపుతోంది. దీనివల్ల ఆదాయం పెరగడంతో పాటు ప్రయాణికులకు కూడా మంచి సదుపాయంగా ఉంటుందని తెలిపారు. ఇలా జనరల్ కోచ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్లిన మిగతా వాహనాల కంటే రైలు ప్రయాణానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
రోజురోజుకీ రైలు ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరగడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత సులభమైన సేవలు అందిస్తూ.. సురక్షితంగా ఉంచాలని భావిస్తే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు జనరల్ కోచ్‌ల వల్ల రైలు ప్రయాణాలు చేసే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని రైల్వే శాఖ భావించింది. దీనివల్ల ఇంకా ఆదాయం రైల్వే శాఖ ద్వారా రానుంది. దేశంలో వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయాల్లో రైల్వే శాఖ ఒకటి. ఇలా కోచ్‌లు పెంచడం వల్ల రైల్వే ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూరుతుందని రైల్వే బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. జనరల్ కోచ్‌ల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యంగా మేలు జరుగుతుంది. ఏసీలో కేటగిరీలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్లలేక.. జనరల్‌లో చాలా మంది ఇబ్బంది పడి వెళ్తుంటారు. అలాంటి వారికి రైల్వే శాఖ మంచి న్యూస్ తెలిపిందని చెప్పవచ్చు. ఈ అదనపు కోచ్‌లు అన్నింటిని హోలీ పండుగ సమయానికి పూర్తి చేయాలని రైల్వే శాఖ చూస్తోంది.