https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్ 8’ చివరి మెగా చీఫ్ గా నిఖిల్..? ఒక రేంజ్ లో పోటీ ఇచ్చిన పృథ్వీ, గౌతమ్!

టాస్క్ ఏమిటంటే నాలుగు మనిషి బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలకు ఆకాశం నుండి పడుతున్న చొక్కాలను పట్టుకొని, తిరిగి బజర్ మోగేలోపు ఎవరైతే బొమ్మలకు చొక్కాలు తొడుగుతారో, వాళ్ళు మెగా చీఫ్ పోటీ దారులు అవుతారు అని అంటాడు బిగ్ బాస్.

Written By: Vicky, Updated On : November 20, 2024 9:36 am
Bigg Boss Telugu 8(232)

Bigg Boss Telugu 8(232)

Follow us on

Bigg Boss Telugu 8: నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 చూస్తూ ఉండగానే చివరి దశకు చేరుకుంది. ఈ వారం లెక్కలో నుండి తీసేస్తే, ఇక కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వీరిలో అందరూ బాగానే ఆడుతున్నారు , కానీ టైటిల్ రేస్ లో మాత్రం నిఖిల్, గౌతమ్ మాత్రమే ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ మొత్తానికి చివరి మెగా చీఫ్ టాస్క్ ఈ వారం జరగబోతుంది అని నిన్నటి ఎపిసోడ్ చివర్లో వేసిన ప్రోమో లో బిగ్ బాస్ చెప్తాడు. టాస్క్ ఏమిటంటే నాలుగు మనిషి బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలకు ఆకాశం నుండి పడుతున్న చొక్కాలను పట్టుకొని, తిరిగి బజర్ మోగేలోపు ఎవరైతే బొమ్మలకు చొక్కాలు తొడుగుతారో, వాళ్ళు మెగా చీఫ్ పోటీ దారులు అవుతారు అని అంటాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో ప్రతీ ఒక్కరు హోరాహోరీగా తలపడుతారు. ముఖ్యంగా నిఖిల్, నబీల్, , పృథ్వీ ,గౌతమ్, అవినాష్, యష్మీ , విష్ణు ప్రియ వంటి వారు ఎంతో కసిగా ఆడుతున్నట్టు నిన్నటి ప్రోమోలో మనమంతా చూసాము. సాధారణంగానే నిఖిల్ టాస్కులలో కింగ్, అతన్ని ఓడించడం చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు దెబ్బ తిన్న పులిలాగా ఉన్నాడు, చివరి మెగా చీఫ్ టాస్క్ అంటే ఇక ఏ రేంజ్ లో ఆడుతాడో ఊహించుకోవచ్చు. కాబట్టి చివరి మెగా చీఫ్ గా నిఖిల్ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం నిఖిల్ కి మాత్రమే కాదు, ఈ టాస్క్ గౌతమ్ కి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడే ఆయన టైటిల్ రేస్ లోకి వచ్చాడు తన గ్రాఫ్ తగ్గకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ వారం మెగా చీఫ్ టాస్కులు గెలవాలి. అందుకే ఆయన కూడా ఎంతో కసిగా ఈ గేమ్ ఆడాడు.

మరోపక్క పృథ్వీ మొదటి వారం నుండి గొడ్డులా కష్టపడి గేమ్స్ ఆడుతున్నాడు, ఆయనకు కూడా మెగా చీఫ్ అవ్వాలనే కోరిక నరనరాల్లో ఉంది. అందుకే పృథ్వీ కూడా అందరినీ డామినేట్ చేస్తూ ఆడేస్తున్నాడు. ఇలా ముగ్గురితో పాటు నబీల్, అవినాష్ కూడా ప్రాణం పెట్టి ఈ టాస్కులు ఆడుతున్నారు. నబీల్ కి మరోసారి పాత నబీల్ ఇంకా అలాగే ఉన్నాడు అని నిరూపించుకోవాలని కసి ఉంది. ఇక అవినాష్ సంగతి తెలిసిందే, నామినేషన్స్ లోకి ఎక్కువగా రాలేదు కాబట్టి, ఈసారి నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే భయం అతనిలో ఉంది. అందుకే ఆయన కూడా టాస్కులు ఎంతో ఫైర్ తో ఆడుతున్నారు. ఇక యష్మీ విషయానికి వస్తే తనలోని ఆడపులి ని మళ్ళీ బయటకి తీసింది. ఈ వారం ఆమె నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉంది అనే విషయం ఆమెకి కూడా అర్థమైంది. అందుకే తనవైపు నుండి నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ ని పెడుతుంది. ఇలా కంటెస్టెంట్స్ అందరూ తమని తాము నిరూపించుకునే ప్రక్రియలో చాలా కసిగా ఆడుతున్నారు. ఎవరు ఈ సీజన్ కి చివరి మెగా చీఫ్ అవ్వబోతున్నారో చూడాలి మరి.