Telangana Formation Day- KCR: ‘మింగ మెతుకు లేదుకానీ.. మీసాలకు సంపెగ నూనె కావాలి’ అన్నట్లుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు తీరు. ఒకవై అపుపలు మహాప్రభో అంటూ కేంద్ర ఆర్థికశాఖ చుట్టూ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ప్రదక్షిణ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగులు జీతాలు సక్రమంగా రాక ఇబ్బంది పడుతున్నారు. పింఛన్లపైనే ఆధారపడి జీవనం సాగించే అనేక మంది ‘ఆసరా’ కోసం నెలనెలా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సర్పంచులు బిల్లులు మహాప్రభో అంటూ ప్రాధేయ పడుతన్నారు. నిధుల కొరతతో అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఒక తండ్రిలా గట్టెక్కించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర ఆవిరాభవం పేరిట తన ప్రాభవం చూపించేందుకు ప్రకటనల రూపంలలో కోట్లు కుమ్మరించారు. గతంలో తెలుగు, తెలంగాణ పత్రికలకు మాత్రమే ఇచ్చే ప్రకటనలు ఈసారీ జాతీయ పత్రికలకు చేరాయి. ప్రజలనలు ఇవ్వడం తప్పనడం లేదు. కానీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థిలిలో ప్రజాధనాన్ని ఇలా ప్రకటనల పేరిట వృథా చేయడమే ఇప్పడు చర్చనీయాంశమైంది.
సొంత డబ్బా కోసమే..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జూన్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వివిధ పత్రికలకు ఇచ్చిన ప్రకటనలతో ప్రయోజనం ఎవరికనే ఆలోచన చేయాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం తన ప్రాభవం చాటుకునేందుకు, తను జాతీయ నేతగా చూపుకునేందుకు సీఎం కేసీఆర్ ఇలా తెలంగాణ ప్రజలు వివిధ పన్నుల రూపంలో కడుతున్న సొమ్ముతో ఇలా ప్రకటనలు ఇచ్చుకోవడం ఏమిటన్న ప్రశ్నలు వినిపస్తున్నాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు, రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాలని కోరేందుకు జాతీయ పత్రికలు, చానెళ్లలో ప్రకటనలు ఇస్తుంటాయి.
Also Read: Modi Jagan: రాష్ట్రపతి ఎన్నికలు: మోడీని ఆడించే అవకాశం జగన్ కు…
ఈ ప్రకటనల్లోనూ ప్రభుత్వ ఇచ్చే సౌర్యాలు, రాయితీలు, స్థానికంగా ఉనన మౌలిక సదుపాయాల గురించి పేర్కొంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం కోట్లు కుమ్మరించి ఇచ్చిన ప్రకటనలు పెట్టుబడి కోసం ఏమాత్రం కాదు. కేవలం కేసీఆర్ తాను ముఖ్యమంత్రిగా తెలంగాణను ఇలా చేశాను.. అని గొప్పలు చెప్పుకోవడానికి, గప్పాలు కొట్టుకోవడానికే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత డబ్బా కోసం ప్రజాధనాన్ని వినియోగించడం ఇంకా దారుణమంటున్నాయి విపక్షాలు. దేశ్‌కీ నేత అనిపించుకోవడానికి సొంత డబ్బులతో ప్రకటనలు ఇచ్చుకోవాలనిగానీ, ఇలా పేజీల కొద్దీ ఇచ్చిన ప్రకటనలకు ప్రభుత్వ లోగోను తగిలించి ప్రజాధనం వృథా చేయడం ఎందుకని నిలదీస్తున్నాయి. ఒకవేⶠప్రకటనలు ఇవ్వాలనుకుంటే తెలంగాణ పత్రికల వరకు సరిపోతుంది. కానీ జాతీయ పత్రికలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని పత్రికలకు ఆయా భాషల్లో ప్రటనల కోసం కోట్లు వెచ్చించడమే ఇప్పుడు ప్రశ్నార్థయమైంది. ‘మ్యాటర్ లేని ప్రొడక్ట్ కు మార్కెటింగ్ ఎక్కువయినట్లు.. కంటెంట్ లేని సినిమాలకు కవరింగ్ ఎక్కువ చేసినట్లు.. ఉద్యోగులకు ఒకటవ తారిఖున జీతాలు ఇవ్వడానికి టికానాలేని రాష్ట్రానికి గిన్ని పత్రికలల్ల మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చుడు అవసరమా సారు..?’ అంటూ ప్రతిపక్షాలు, వివిధ సంఘాల నాయకులూ ప్రశ్నిస్తున్నారు.
ప్రకటనల్లోనూ అబద్ధాల ప్రచారం..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని గురువారం ఇచ్చిన ప్రకటనల్లో కొన్ని తప్పులను ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. చేయని పనులు చేసినట్లు కోట్ల రూపాయలు పెట్టి ప్రకటనలు ఇచ్చిన తీరును నెట్టింట్లో ఎండగడుతున్నారు.
‘ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా’ ఈ పదాలు చూస్తే తెలంగాణలో వ్యవసాయం చేసే రైతులందరికీ బీమా వర్తింస్తుందన్న భావన కలుగుతోంది. పొరుగు రాష్ట్రాల వారు చూస్తే నిజమే అనేలా ఉంది. కానీ వాస్తవ పరిస్థితి వేరు. 59 ఏళ్లలోపు రైతులకే బీమా వర్తిస్తుంది. సాధారణంగా రైతులు 70 నుంచి 75 ఏళ్ల వరకు వ్యవసాయం చేస్తారు. తెలంగాణలో 60 ఏళ్లు పైబడిన రైతులు 30 శాతం ఉన్నారు. వీరెవరికీ బీమా వర్తించడం లేదు.
– రాష్ట్ర ప్రభుత్వం 2601 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించి ప్రతీ రైతే వేదికకు ఏఈవోను నియమించినట్లు ప్రకటనలో పేర్కొంది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో రైతుల వేదికలు పూర్తి కాలేదు. ఏఈవోలను నియమించిన మాట అవాస్తవం, రైతులకు రైతే వేదికల్లోనే భూసార పరీక్షలు చేస్తామని చెప్పిన ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యం కలిపంచలేదు.
– సాగునీటి ప్రాజెక్టుల్లో చాలా వరకు అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ రష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము పూర్తిచేసి రైతులకు సాగునీరిస్తున్నట్లు ప్రకటనలో గొప్పలు చెప్పుకుంది.
– విద్యావ్యవస్థ రాష్ట్రంలో పూర్తిగా అథఃపాతాళానికి పడిపోయింది. ఎనిమిదేళ్లలో అంత్యంత దయనీయంగా తయారైన ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉందంటే అది విద్యాశాఖనే. కానీ పత్రికా ప్రకటనల్లో మాత్రం విద్యావ్యవస్థను గొప్పగా చెప్పుకున్నారు కేసీఆర్.
– ధరణ పోర్టల్ గురించి ప్రకటనలో గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఐదారు నెలల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రభుత్వం నియమించిన ఉప సంఘం కూడా ధరణిలో లోపాలు ఉన్నట్లు ప్రకటించాయి.
– డబుల్ బెడ్రూం ఇళ్లు.. తెలంగాణలో టీఆర్‌ఎస్ రెండుసార్లు అధికాకరంలోకి రావడానికి ఈ హామీ ఒక కారణం. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో నిర్మించింది చాలా తక్కువ. మరోవైపు 2018 ఎన్నికల సమయంలో సొంత భూమి ఉన్నవారికి రూ.5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గురువారం ఇచ్చిన ప్రకటనలో రూ.3 లక్షలే ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
– హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు కేసీఆర్ ప్రవేశపెట్టి పథకం దళితబంధు. హుజూరాబాద్ ఓటర్లలో 40 శాతం దళితులే ఉన్నట్లు గుర్తించి దీనిని హడావుడిగా ప్రారంభించారు. రాష్ట్రమంతా అమలు చేస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా రాష్ట్రంలో 5 శాతం మంది దళితులకు కూడా దళితబంధు అందలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే పత్రికా ప్రకటనల్లో చాలా వరకు తప్పుడు ప్రచారమే. క్షత్రస్థాయికి, ప్రకటనలకు చాలా తేడా ఉంది. కేవలం దేశ్‌కీ నేత అనిపించుకునేందుకు చేసుకుంటున్న ప్రచారమే ఇదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read:Modi Jagan: రాష్ట్రపతి ఎన్నికలు: మోడీని ఆడించే అవకాశం జగన్ కు…