Pooja Hegde: ఒక్కసారి తిరోగమనం మొదలైతే ఆపడం ఎవరి తరం కాదు. బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ ఇచ్చిన పూజా కెరీర్ కూడా తిరోగమనం వైపు వెళుతున్నట్లుంది. మొన్నటి వరకు పూజా హెగ్డే అంటే ఓ లక్కీ చార్మ్. ఆమె హీరోయిన్ గా ఉన్నారంటే మూవీ హిట్టే. అరవింద సమేత వీర రాఘవ మూవీతో మొదలైన ఆమె సక్సెస్ జర్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వరకు సాగింది. మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురంలో ఇలా వరుస విజయాలు అందుకున్నారు.
రాధే శ్యామ్ మూవీతో పూజకు ఫెయిల్యూర్స్ మొదలయ్యాయి. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య అట్టర్ ప్లాప్ ఖాతాలో చేరాయి. ఇవన్నీ ఒకదాన్ని మించిన మరొక డిజాస్టర్స్. ఆచార్య అయితే చిరంజీవి కెరీర్లోనే కాదు టాలీవుడ్ చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా రికార్డులకు ఎక్కింది. ఇలా వరుస పరాజయాల నేపథ్యంలో ఒప్పుకున్న చిత్రాలు కూడా చేజారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Koratala Siva- Ram Charan: కొరటాల కి రామ్ చరణ్ మరో చాన్స్..భయపడిపోతున్న ఫాన్స్
పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ మూవీ నుండి పూజా తప్పుకున్నారన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండగా అధికారికంగా ప్రకటించిన మహేష్ మూవీ నుండి తప్పించారంటున్నారు. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లాంచింగ్ ఈవెంట్ కి పూజా హాజరు కావడం జరిగింది.
కారణం ఏమిటో తెలియదు కానీ పూజాను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో పవన్ మూవీ నుండి ఆమె తప్పుకున్నారా? తప్పించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ ప్రాజెక్ట్ పూజా నుండి చేజారినా… మహేష్ మూవీ కోల్పోవడం అనూహ్యం. దర్శకుడు త్రివిక్రమ్ ఫేవరెట్ హీరోయిన్ గా పూజా ఉన్నారు. ఆయన గత రెండు చిత్రాల హీరోయిన్ పూజానే. అంత సన్నిహిత సంబంధం కలిగిన పూజాను ఆయన ఎలా వదులుకుంటారనేది చర్చించాల్సిన అంశం.
ఈ మధ్య పూజాపై కంప్లైంట్స్ కూడా అధికమయ్యాయి. పరిమితికి మించి సిబ్బందిని మైంటైన్ చేస్తూ నిర్మాతలపై భారం మోపుతున్నారట. అలాగే వరుస విజయాల తర్వాత భారీగా రెమ్యూనరేషన్ పెంచేశారట. కాగా రాధే శ్యామ్ మూవీ విషయంలో అమ్మడు టెక్కు చూసిన ప్రభాస్ ఆగ్రహానికి గురయ్యారని తెలిసింది. పూజాతో ప్రభాస్ కి చెడిందని వార్తలు రాగా, అవి నిజమే అని ప్రమోషనల్ ఈవెంట్స్ లో వారి ప్రవర్తన ద్వారా తెలిసింది.
Also Read:Ram Chara- NTR: ఎన్టీఆర్ వర్సెస్ చరణ్… ఈ గొప్పల కొట్లాటకు అంతం లేదా!
Recomended Videos