Koratala Siva- Ram Charan: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది..అందువల్ల 40 ఏళ్ళ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం లో ఎన్నడూ లేని విధంగా ఓపెనింగ్స్ నుండి క్లోసింగ్ కలెక్షన్స్ వరుకు దారుణమైన వసూళ్లను రాబట్టి బయ్యర్లకు కనివిని ఎరుగని నష్టాలను చూపించింది..ఈ సినిమా ఈ రేంజ్ లో ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం కొరటాల శివ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..నమ్మి అతనికి ఇద్దరు హీరోలు అన్ని రోజుల డేట్స్ ఇస్తే వాళ్ళిద్దరి కెరీర్ లోనే వరస్ట్ సినిమాని ఇచ్చి మెగా అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి అయ్యేలా చేసాడు..ఇది ఇలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త మెగా అభిమానులను కలవర పెడుతోంది.
Also Read: Sarkaru Vaari Paata on Amazon: ప్రైమ్ లో సర్కారు వారి పాట… అయితే మహేష్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్!
అదేమిటి అంటే గతం లో రామ్ చరణ్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో ఒక్క సినిమా తెరకెక్కాల్సి ఉంది..వాస్తవానికి #RRR సినిమా తర్వాత ఈ సినిమానే చేద్దాం అనుకున్నారు..కానీ రాజమౌళి సినిమా పూర్తి అవవడానికి చాలా సమయం పట్టేట్టు ఉండడం తో తన బదులుగా, మెగాస్టార్ చిరంజీవి తో సినిమా సెట్ చేసి ఇస్తాను అని మాట ఇచ్చాడట రామ్ చరణ్..ఇచ్చిన మాట ప్రకారమే చిరంజీవి తో ఆచార్య సినిమాని నిర్మించిన రామ్ చరణ్, ఇప్పుడు కొరటాల శివ కి కూడా మరో సినిమా ఛాన్స్ ఇవ్వడానికి ముందుకి వచ్చాడట రామ్ చరణ్..కొరటాల తీసుకొచ్చిన కథ రామ్ చరణ్ ని ఎంతో థ్రిల్ కి గురి చెయ్యడం తో ఆచార్య సినిమా ఫలితం ని పక్కన పెట్టిమరి ఈ సినిమా చేద్దాం అని మాట ఇచ్చాడట రామ్ చరణ్..ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా పూర్తి అవ్వగానే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నవార్త..మరి ఆచార్య సినిమా తో మెగా అభిమానులను ఘోరంగా నిరాశపరిచిన కొరటాల శివ, కనీసం ఈ సినిమాతోనైనా అభిమానుల ఆకలి ని తీరుస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read: Ram Chara- NTR: ఎన్టీఆర్ వర్సెస్ చరణ్… ఈ గొప్పల కొట్లాటకు అంతం లేదా!
Recomended Videos