నేరేడ్ మెట్ గులాబీ ఖాతాలోకి.. 56కు చేరిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు..!

జీహెచ్ఎంసీ ఎన్నిలకు కౌంటింగ్ డిసెంబర్ 4న జరిగాయి. మొత్తం 150 డివిజన్లకుగాను 149స్థానాలకు కౌంటింగ్ పూర్తయింది. ఒక్క నేరేడ్ మెట్ ఫలితం మాత్రం ఆగిపోయింది. స్వస్తిక్ గుర్తున్న ఓట్లను మాత్రమే లెక్కించాలని ఎన్నికల రోజు హైకోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. నేరేడ్ మెట్ లో స్వస్తిక్ గుర్తు కంటే మిగతా గుర్తుల ఓట్లు ఎక్కువగా పోలవడంతో ఎన్నికల కమిషన్ కౌంటింగ్ నిలిపివేసింది. Also Read: డిసెంబర్ 9..ఈ రోజును తెలంగాణ ప్రజలు ఎలా మర్చిపోతారు..? ఆ […]

Written By: Neelambaram, Updated On : December 9, 2020 11:46 am
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నిలకు కౌంటింగ్ డిసెంబర్ 4న జరిగాయి. మొత్తం 150 డివిజన్లకుగాను 149స్థానాలకు కౌంటింగ్ పూర్తయింది. ఒక్క నేరేడ్ మెట్ ఫలితం మాత్రం ఆగిపోయింది. స్వస్తిక్ గుర్తున్న ఓట్లను మాత్రమే లెక్కించాలని ఎన్నికల రోజు హైకోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. నేరేడ్ మెట్ లో స్వస్తిక్ గుర్తు కంటే మిగతా గుర్తుల ఓట్లు ఎక్కువగా పోలవడంతో ఎన్నికల కమిషన్ కౌంటింగ్ నిలిపివేసింది.

Also Read: డిసెంబర్ 9..ఈ రోజును తెలంగాణ ప్రజలు ఎలా మర్చిపోతారు..?

ఆ తర్వాత ఎన్నికల కమిషన్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ కు రాజ్యాంగ పరమైన గుర్తింపు ఉందని గుర్తు చేస్తూ.. తమ విధుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవద్దని ఎన్నికల కమిషన్ కోరింది. దీంతో హైకోర్టు తాజాగా ఓట్ల లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేడు నేరేడ్ మెట్ డివిజన్లో తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు.

నేరెడ్‌మెట్ డివిజన్‌లో ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థిపై 782ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Also Read: తెలంగాణలో నడిపించే నాయకుడెవరు..?

జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ కు 56.. బీజేపీకి 48.. ఎంఐఎం కు 2.. కాంగ్రెస్ కు 2స్థానాల్లో గెలిచాయి. మొత్తం 150డివిజన్లలో ఫలితాలు వెల్లడికావడంతో మేయర్ ఎన్నిక లాంఛనం కానుంది. ప్రస్తుతం పాలవవర్గం గడువు ఫిబ్రవరి 10వరకు ఉంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం అవలంభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్