
బద్ద విరోధి అయిన ఏపీ సీఎం జగన్ కు టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ థ్యాంక్స్ చెప్పారు. ఒక సుధీర్ఘమైన లేఖ రాశారు. మేం కోరినట్టు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు ఈ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఓ ఉచిత సలహా కూడా జగన్ కు పడేశాడు. కరోనా తీవ్రత తగ్గితే జూన్ మొదటి వారంలో సమీక్షించి పరీక్షలు నిర్వహించుకోవచ్చని లోకేష్ బాబు సూచించారు.
ఈ కరోనా సెకండ్ వేవ్ వేళ అసలు బయటకు వస్తేనే ప్రాణాలు పోయేలా పరిస్థితులున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీలేక, ఆక్సిజన్ అందక అల్లకల్లోలంగా మారింది. ఈ క్రమంలోనే పరిస్థితులు గమనించిన జగన్ సర్కార్ ఏపీలో పరీక్షలు వాయిదా వేసింది.
అయితే ఇదే అదునుగా లోకేష్ బాబు అందిపుచ్చుకున్నారు. తమ ఒత్తిడి వల్లే జగన్ వెనకడుగు వేశాడని.. అది తమ ఘనతే అన్నట్టుగా కలరింగ్ ఇచ్చాడు. లోకేష్ బాబు ఈ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజకీయంగా చంద్రబాబు అంత నాలెడ్జ్ లేదనుకొని ఇన్నాళ్లు లోకేష్ ను తిట్టేవారు. కానీ ఇప్పుడు అధికార పక్షం నిర్ణయాలను కూడా తన ఖాతాలో వేసుకున్న లోకేష్ బాబు తెలివితేటలు చూసి ‘నువ్వు సూపరబ్బా’ అని అభినందించకుండా ఉండలేకపోతున్నారట మన తెలుగుతమ్ముళ్లు..
మెల్లిగా ఏదోలాగా వెళ్లదీస్తాడు అని లోకేష్ గురించి అనుకుంటే ఇప్పుడు ఏకంగా దున్నే పనిలో పడ్డాడట లోకేష్. ఎంతైనా తండ్రి వారసత్వాన్ని సరిగ్గా అందుపుచ్చుకోవడం లేదన్న అపవాదు తెచ్చుకున్న లోకేష్ ట్రాక్ లో పడుతున్నాడని అర్థం అవుతోంది.