
కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని వేవ్ లు కూడా వస్తాయన్నారు. అయితే ఈ థర్డ్ వేవ్ ఎప్పుడు సంభవిస్తుందో మాత్రం స్పష్టంగా చెప్పలేమన్నారు. వైరస్ లో ఏర్పడే మార్పులను ముందుగా అంచానా వేసి, వాటికి అనుగుణంగా వ్యాక్సిన్ లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలన్నారు.