Nara and Daggubati Families: ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. చాలా కాలం నుంచి మాటలు లేని ఆ ఇరువురూ ఒకే వేదికపైన కనబడ్డారు. ఆత్మీయంగా ఒకరిని మరొకరు పలకరించుకోవడంతో పాటు పలు విషయాలపైన చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు మనం చర్చించుకుంటున్నది ఎవరి గురించి అంటే..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇంతకీ వారు ఎక్కడ కలిశారు, అసలేం జరిగిందనే విషయాలపై ఫోకస్..

సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య చాలా కాలం నుంచి మాటలు లేవు. రాజకీయంగానూ వీరు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు ఒకే వేదికపై కనిపించారు. ఆ వేడుక ఎవరిదంటే. సీనియర్ ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి కుటుంబానికి సంబంధించిన వేడుకలో ఒక్కటిగా కనిపించారు. ఉమామహేశ్వరి కూతురి వివాహ నిశ్చితార్థ వేడుకకు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.

ఈ వేడుకలో సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రాజకీయాలను పక్కనబెట్టి ఆత్మీయంగా కలుసుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, బీజేపీ మహిళా నేత పురందేశ్వరి కూడా మాట్లాడుకున్నారు. తెలుగు రాజకీయాల్లో నారా, దగ్గుబాటి వారి మధ్య ఉన్న వైరం గురించి ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు. కానీ, అప్పటి వారికి కంపల్సరీగా ఐడియా ఉండే ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దింపేసిన ఎపిసోడ్ తర్వాత నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు విడిపోయారు. నిజానికి ఆ ఎపిసోడ్‌లో చంద్రబాబు తర్వాత కీ రోల్ ప్లే చేసింది దగ్గుబాటినే. కానీ, తర్వాత కాలంలో దగ్గుబాటికి చంద్రబాబు ప్రయారిటీ ఇవ్వలేదు. దాంతో నారా, దగ్గుబాటి వారు విడిపోయారు. చంద్రబాబు పేరు ప్రస్తావించడానికి కూడా దగ్గుబాటి ఇష్టపడరు.
Also Read: ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు
దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. అయితే, ఆయన తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఫంక్షన్‌లో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో ముచ్చటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. గతం మరిచి, మళ్లీ కలవబోతున్నారా? రాజకీయ సమీకరణాల్లో మార్పులు రాబోతున్నాయా? అనే ఊహాగానాలు మొదలవుతున్నాయి.
Also Read: చంద్రబాబు టీడీపీని కుప్పంలో గట్టెక్కిస్తారా?