Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ను వానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఇటీవల ముంచిన తుపాను ప్రభావం తొలగిపోకముందే మరో ముప్పు ఏర్పడుతోంది. రాయలసీమ జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వానలంటేనే భయపడుతున్నారు. ఇళ్లు, పంటలు నాశనం అయ్యాయి. అయినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందనే సూచనతో తల్లడిల్లుతున్నారు. తుపాన్ బారి నుంచి తప్పించుకోవడమెలా అని మథనడుతున్నారు.

ఏపీపై వరుణుడు పగ బట్టాడా? అనే సందేహాలు వస్తున్నాయి. ఎడతెరపి లేని వానలు పంటలను నష్టం చేస్తున్నాయి. ఇప్పటికే నష్టాల బారిన పడిన ప్రజలు మరోసారి వానలు పడతాయంటే ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Also Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఏపీలో ఆంక్షలు మరింత కఠినతరం..
ఇటీవల కురిసిన వర్షాలకే పంటలు పూర్తిగా నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగంపై మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పరిస్థితి మారిందని తెలుస్తోంది. వరదల ప్రభావంతో ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో వర్షాల ధాటికి ప్రజలు కంగారు పడుతున్నారు. ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. దీంతో వాతావరణ శాఖ సూచనలతో నష్టం ఎంత భారీగా ఉంటుందోనని బెంగ పడుతున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో రెండు తెలుు స్టేట్లు వర్షాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై వర్షాల బారిన పడే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: కేంద్రంపై మరో ఉద్యమానికి ఆంధ్రుల రెడీ