‘సాగర్’ లో పోరుకు సమయం లేదు మిత్రమా..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సబంధించి ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.నామినేషన్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో శుక్రవారం మినహాయిస్తే.. కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ జానారెడ్డి పేరును ఖరారు చేసింది. 30న నామినేషన్ వేయనున్నారు. బీజేపీ.. టీఆర్ఎస్ లు అభ్యర్థలను ఇంకా ప్రకటించలేదు. అయితే తిరుపతిలో సీటు త్యాగం చేసిన జనసేనకు బీజేపీ సాగర్ పోరులో అవకాశం ఇస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సాగర్ లో నామినేషన్లకు వరుస […]

Written By: Srinivas, Updated On : March 26, 2021 2:01 pm
Follow us on


నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సబంధించి ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.నామినేషన్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో శుక్రవారం మినహాయిస్తే.. కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ జానారెడ్డి పేరును ఖరారు చేసింది. 30న నామినేషన్ వేయనున్నారు. బీజేపీ.. టీఆర్ఎస్ లు అభ్యర్థలను ఇంకా ప్రకటించలేదు. అయితే తిరుపతిలో సీటు త్యాగం చేసిన జనసేనకు బీజేపీ సాగర్ పోరులో అవకాశం ఇస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సాగర్ లో నామినేషన్లకు వరుస సెలవులు ఉంటాయాని ఈసీ గురువారం ప్రకటించింది. దీంతో శుక్రవారం మినహా చివరిరోజు మార్చి 30నే అభ్యర్థుల నామినేషన్లకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఈనెల 30 నామినేషన్ వేయనున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీలు సైతం చివరిరోజే తమ అభ్యర్థని ఖరారు చేసి అప్పటికప్పుడే నామినేషన్ వేయించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య కొడుకు భగత్ తో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ లు టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో ఒక్కరికి అవకాశం దక్కనుంది. మరో వైపు బీజేపీ అభ్యర్థి రేసులో కడారి అంజయ్య, రవినాయక్, నివేదిత రెడ్డి పాటు టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

సాగర్లో పార్టీ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ గురువారం కీలక నేతలతో చర్చలు జరిపారు. ఆ భేటీ తర్వాత ఢిల్లీలోని హైకమాండ్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తిరుపతి లోక్ సభలో రత్నప్రభకు, బెల్గాం లోక్ సభ స్థానంలో దివంతగత కేంద్ర మంత్రి సురేశ్ అంగడి భార్య మంగళ పేరును ఖరారు చేసది. అదే సమయంలో కర్ణాటక, జార్ఖండ్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఉప ఎన్నికలకూ పేర్లను ప్రకటించారు. కానీ సాగర్ సీటుపై ట్విస్ట్ ఇస్తూ అభ్యర్థిని ప్రకటించలేదు.

సాధారణంగా ప్రతీ ఉప ఎన్నికనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సాధ్యమైనంత గట్టిగా పోరాడే బీజేపీ, నాగార్జున సాగర్ విషయంలో మాత్రం దూకుడు తగ్గించడం, కనీసం ప్రచార కమిటీని కూడా ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. విచిత్రంగా సాగర్ లో జనసేన పార్టీ.. బీజేపీతో సంబంధం లేకుండా ప్రచారకమిటీని ప్రకటిస్తే, తిరుపతి లోక్ సభ స్థానంలో బీజేపీ కూడా జనసేనతో సంబంధంలేని ప్రచార కమిటీని ప్రకటించింది. తిరుపతిలో జనసేన త్యాగానికి ప్రతిఫలంగా నాగార్జున సాగర్ లో పోటీకి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సాగర్ లో ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థిని పవన్ కల్యాణ్ బరిలోకి దింపుతారనే వాదన వినిపిస్తోంది.