బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ పై కేసీఆర్ ప్రకటన

సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మరో సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను ప్రారదోలారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ దిశగా సాగుతున్న వ్యవహారంపై కేసీఆర్ అసెంబ్లీలో స్పందించారు. పక్కనున్న మహారాష్ట్రలో భారీ కేసులు నమోదు అవుతుండడం.. తెలంగాణకు ఆనుకొని ఉన్న నాందేడ్ జిల్లాలో లాక్ డౌన్ విధించడంతో తెలంగాణలోనూ లాక్ డౌన్ తప్పదని ఆందోళన మొదలైంది. స్కూళ్ల మూసివేతతో ఆ బలం రెట్టింపు అయ్యింది. శాసనసభలో బడ్జెట్ ఆమోదంపై చర్చ […]

Written By: NARESH, Updated On : March 26, 2021 2:01 pm
Follow us on

kcr in assembly

సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మరో సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను ప్రారదోలారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ దిశగా సాగుతున్న వ్యవహారంపై కేసీఆర్ అసెంబ్లీలో స్పందించారు. పక్కనున్న మహారాష్ట్రలో భారీ కేసులు నమోదు అవుతుండడం.. తెలంగాణకు ఆనుకొని ఉన్న నాందేడ్ జిల్లాలో లాక్ డౌన్ విధించడంతో తెలంగాణలోనూ లాక్ డౌన్ తప్పదని ఆందోళన మొదలైంది. స్కూళ్ల మూసివేతతో ఆ బలం రెట్టింపు అయ్యింది.

శాసనసభలో బడ్జెట్ ఆమోదంపై చర్చ కు కేసీఆర్ సమాధానమిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించమని కేసీఆర్ స్పష్టం చేశారు. మాస్క్ లు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కరోనా విస్ఫోటనమైన రూపం తీసుకోకముందే చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణలో కొన్ని కరోనా ఆంక్షలు విధిస్తామని.. వాటిని అందరూ పాటిస్తే ఆ వైరస్ సోకదని కేసీఆర్ వివరించారు.

కరోనా విద్యార్థులకు విస్తరించకుండా.. గందరగోళం నెలకొనకుండా ముందస్తుగా విద్యాసంస్థలు మూసివేశామని కేసీఆర్ వివరించారు. కరోనా నేపథ్యంలో తాత్కాలికంగానే విద్యాసంస్థలు మూసివేశామని.. తొందరపడి లాక్ డౌన్ పెట్టబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి ఎవరికి అంతుపట్టకుండా తెలంగాణ సహా ప్రపంచాన్ని వేధిస్తోందని కేసీఆర్ అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం చేతుల్లో ఉందని.. టీకా డోసులను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తోందని సీఎం వివరించారు.