https://oktelugu.com/

పవన్ వెంట మనోహరుడు.. ఇందుకేనా?

జనసేన్ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా.. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ ఉండాల్సిందే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వీరిపై సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. అయితే.. అవన్నీ ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల చేష్టలే అనుకున్నా.. ప్రతీ విషయంలో, ప్రతీ కార్యక్రమంలో పవన్ వెంట మనోహర్ ఉండడంపై చర్చ అయితే ఉంది. దానికి గల కారణాలు విశ్లేసిస్తే.. Also Read: ఇంటింటికి రేషన్ సాధ్యమవుతుందా..? ఒక్కొక్కరుగా.. పార్టీ పెట్టిన కొత్తలో ఉన్న మేధావి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 / 04:11 PM IST
    Follow us on


    జనసేన్ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా.. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ ఉండాల్సిందే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వీరిపై సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. అయితే.. అవన్నీ ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల చేష్టలే అనుకున్నా.. ప్రతీ విషయంలో, ప్రతీ కార్యక్రమంలో పవన్ వెంట మనోహర్ ఉండడంపై చర్చ అయితే ఉంది. దానికి గల కారణాలు విశ్లేసిస్తే..

    Also Read: ఇంటింటికి రేషన్ సాధ్యమవుతుందా..?

    ఒక్కొక్కరుగా..
    పార్టీ పెట్టిన కొత్తలో ఉన్న మేధావి వర్గం, కొద్దోగొప్పో ప్రజలకు తెలిసిన నాయకులు ఇప్పుదు పవన్ వెంట లేరు. ప్రజలకు ముఖ పరిచయం ఉన్న నాయకుడు నాదెండ్ల మాత్రమే పవన్ వెంట ఉన్నారు. ఈయన జనసేనలోనే కొనసాగడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.

    బయటికి వెళ్తే..
    జనసేనను వీడి వేరే పార్టీలకు వెళ్లే పరిస్థితి నాదెండ్లకు లేదు. ఇతర పార్టీలకు ఆయనతో అంత అవసరం కూడా లేదు. ఇక, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించే అవకాశం తక్కువే అన్నది వాదన. అంతేకాకుండా.. జనసేనలో పవన్ తర్వాత నెంబర్ 2 అనే ముద్ర అయితే ఉంది. కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా జనసేనలోనే కొనసాగుతున్నారనేది పలువురి వాదన.

    Also Read: ఆధ్యాత్మిక కేంద్రంగా విశాఖ..?

    సింగిల్ నేతగా పవన్..
    అటు పవన్ కల్యాన్ కు కూడా ఇంతకంటే ప్రత్యామ్నాయం కనిపించట్లేదు. జనసేనలో ఆయన మినహా చెప్పుకోదగ్గ నేతలు లేరు. ఎటొచ్చీ మనోహర్ మాత్రమే కనిపిస్తున్నారు. అందుకే.. మరీ ఒంటరి అనే పేరు రాకుండా నాదెండ్లతో సమావేశాలు.. ఇతర కార్యక్రమాలకు పవన్ హాజరవుతున్నారన్నది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్