https://oktelugu.com/

ఇంటింటికి రేషన్ సాధ్యమవుతుందా..?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ కొత్తరకంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. వీటిలో కొన్ని సత్ఫలితాలిస్తున్నా.. మరికొన్ని సాధ్యం కానివిధంగా ఉంటున్నాయి. తాజాగా ఇంటింటికి రేషన్ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. జనవరి 1 నుంచి ఈ పద్ధతి అమల్లోకి రానుంది. ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు వలంటీర్లు లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి అందించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా వాహనాలను కూడా కొనుగోలు చేశారు. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా..? అని కొందరు వాదిస్తున్నారు. Also Read: ఆధ్యాత్మిక కేంద్రంగా విశాఖ..? ప్రభుత్వం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 13, 2020 / 03:59 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో జగన్ కొత్తరకంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. వీటిలో కొన్ని సత్ఫలితాలిస్తున్నా.. మరికొన్ని సాధ్యం కానివిధంగా ఉంటున్నాయి. తాజాగా ఇంటింటికి రేషన్ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. జనవరి 1 నుంచి ఈ పద్ధతి అమల్లోకి రానుంది. ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు వలంటీర్లు లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి అందించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా వాహనాలను కూడా కొనుగోలు చేశారు. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా..? అని కొందరు వాదిస్తున్నారు.

    Also Read: ఆధ్యాత్మిక కేంద్రంగా విశాఖ..?

    ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు రేషన్ షాపుకు వెళ్లి తీసుకోవడం కొందరికి ఇబ్బందిగా మారింది. అంతేకాకుండా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకోకపోవడం వల్ల ఆ సరుకులు వక్రమార్గానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే అందించనుంది. అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఇందులో కొన్ని లోపాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

    రేషన్ సరుకుల లబ్ధిదారుల ఇళ్లకు అందించడానికి ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేయాలి. వాహనానికి డ్రైవర్, ఇతర సిబ్బందిని నియమించుకోవాలి. ఇక వలంటీర్లకు ఇళ్ల కేటాయింపుల్లో అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఇళ్ల కేటాయింపు జరుగుతుంది. ఇలా జరగడం వల్ల సిబ్బంది మధ్య వ్యత్యాసాలు ఏర్పడే అవకావం ఉంది.

    Also Read: తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి : తెలంగాణ తరహాలో ప్రచారం చేయరట..!!

    ఇక లబ్ధిదారులు తమకు కావాల్సిన రేషన్ సరుకులు అవసరమున్నవారు ఒకరోజు వెళ్లి తీసుకునేవారు. ఇప్పడు రేషన్ సరుకు వ్యాన్ వచ్చే అవకాశం ఉండడంతో పది రోజుల పాటు ఇంటి పట్టునే ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోకి కూలీ పనులకు వెళ్లే వారికి ఇది సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు ఇప్పటి వరకు పోర్టబులితో వలస కూలీలు తాము ఉండే చోట రేషన్ సరుకులు తీసుకునేవారు. వారికి స్థిర నివాసం ఉండనందున సరుకులు ఎలా అందిస్తారోనన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఈ విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్