ఏపీ ఎలక్షన్ కమిషనర్ కు రెవెన్యూ ఉద్యోగుల షాక్..!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా పంచాయతీ వీడడం లేదు. ప్రభుత్వం వర్సెస్, ఎలక్షన్ కమిషన్ అన్నట్లుగా పోరు సాగుతుండడంతో లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ఒకరిపై ఒకరు వాదనలు వినిపింకోవడంతోనే సరిపోతుంది. Also Read: పవన్ వెంట మనోహరుడు.. ఇందుకేనా? తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నా రెవెన్యూ ఉద్యోగులు మాత్రం సహకరించరని ఆ సంఘం నాయకులు తెలుపుతున్నారు. ఇటీవల ఏర్పాటు […]

Written By: NARESH, Updated On : December 13, 2020 4:34 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా పంచాయతీ వీడడం లేదు. ప్రభుత్వం వర్సెస్, ఎలక్షన్ కమిషన్ అన్నట్లుగా పోరు సాగుతుండడంతో లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ఒకరిపై ఒకరు వాదనలు వినిపింకోవడంతోనే సరిపోతుంది.

Also Read: పవన్ వెంట మనోహరుడు.. ఇందుకేనా?

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నా రెవెన్యూ ఉద్యోగులు మాత్రం సహకరించరని ఆ సంఘం నాయకులు తెలుపుతున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని అంటున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవల ప్రకటన చేశారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కోరుతూ లేఖ రాశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎస్ నిరాకరించారు. గ్రామాల్లో కోవిడ్ ప్రభావం ఇంకా తొలిగిపోనందున ఇప్పడు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్నారు.

Also Read: ఇంటింటికి రేషన్ సాధ్యమవుతుందా..?

దీంతో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ గవర్నర్ ను కలిసి ఆ తరువాత కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తతం స్థానిక ఎన్నికల నిర్వహణ విషయం కోర్టులోనే ఆగిపోయింది. ఇదే సమయంలో రెవెన్యూ ఉద్యోగులు ఎన్నికలకు సహకరించిన ఆ సంఘం నాయకులు తేల్చి చెబుతున్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారు. కరోనా సోకిన వారిలో ఎక్కువ శాతం రెవెన్యూ ఉద్యోగులే ఉన్నారని, ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే మరోసారి పెను ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందన్నారు. దీంతో ఎలక్షన్ కమిసనర్ నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్