Atlantic Ocean Virus: సముద్రంలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. వాటితో పాటు కంటికి కనిపించని జంతువులు కూడా ఉంటాయి. ఈ భూభాగంలో ఉన్న సముద్రాలలో శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. సముద్రంలో అంతుచిక్కని జంతువులతోపాటు.. అంతకుమించిన రహస్యాలు ఉంటాయి. మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో రకాలైన వస్తువులు సముద్రం ద్వారా లభిస్తున్నాయి. మనం నిత్యం వాడే ఇంటర్నెట్ కూడా సముద్రం అంతర్భాగంలో ఏర్పాటు చేసిన కేబుల్స్ ద్వారా వస్తూ ఉంటుంది.
కెరటాలు, అలలు.. విస్తారమైన మత్స్య సంపదకు నిలయమైన సముద్రాలలో ఇప్పుడు వైరస్ కలకలం నెలకొంది. ఈ వైరస్ కు అట్లాంటిక్ సముద్రం కేంద్రంగా మారింది. ఈ సముద్రంలో ప్రయాణం సాగిస్తున్న ఒక క్రుజ్ నౌక లో వైరస్ కలకలం సృష్టిస్తోంది. అందులో ఇద్దరు భారతీయులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుంది.
అట్లాంటి సముద్రంలోని కానరీ ఐలాండ్స్ కు ప్రయాణిస్తున్న నౌకలో అంట అనే వైరస్ కలకలం రేపుతోంది. 149 మంది ప్రయాణికులు ఈ ఓడలో ప్రయాణిస్తున్నారు. వైరస్ వల్ల ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. మరో 8 మందికి వైరస్ సోకినట్టు సమాచారం. ఈ ఓడలో ఇద్దరు భారతీయులు కూడా ప్రయాణిస్తున్నారు. వారికి సంబంధించిన సమాచారం ఇంతవరకు లేదు. ఈ ఓడలో దాదాపు 23 దేశాలకు సంబంధించిన ప్రయాణికులు ఉన్నారు.
ఎలుకల ద్వారా ఈ వైరస్ సోకుతూ ఉంటుంది. తీవ్రమైన వ్యాధులకు గురైన ఎలుకలలో ఈ వైరస్ ఉంటుంది. ఇది అంటువ్యాధి లాగా వ్యాపిస్తుంటుంది. ఆ ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా ఈ వైరస్ దొరికింది. అలసట.. తీవ్రమైన జ్వరం.. విపరీతమైన కండరాల నొప్పి.. భరించలేని దగ్గు.. ఊపిరి తిత్తులలో నీరు చేరడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి సోకితే బతకడం కష్టమని వైద్యులు అంటున్నారు. అయితే ఈ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.