https://oktelugu.com/

కన్నీళ్లు పెట్టిస్తున్న గూగుల్ సీఈవో స్టోరీ

ఒక మొక్కగా ఉన్నప్పుడు అది ఎవరికీ పట్టదు.. కానీ పెరిగి పెద్దదై మానై నిలుచున్న వేళ దాని కింద సేదతీరుతాం.. దాని గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కు సీఈవో మన భారతీయుడు.. చెన్నై వాసి సుందర్ పిచాయ్. ప్రపంచప్రఖ్యాత సంస్థకు సీఈవోగా అదృష్టంతో కాలేదు. ఆయన పడ్డ కష్టాలను తాజాగా ఏకరువు పెట్టాడు. అంత కష్టపడి అంత ఎత్తుకు ఎదిగిన సుందర్ పిచాయ్ స్టోరీ ఆ విద్యార్థులకు కన్నీళ్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2020 / 05:55 PM IST
    Follow us on


    ఒక మొక్కగా ఉన్నప్పుడు అది ఎవరికీ పట్టదు.. కానీ పెరిగి పెద్దదై మానై నిలుచున్న వేళ దాని కింద సేదతీరుతాం.. దాని గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కు సీఈవో మన భారతీయుడు.. చెన్నై వాసి సుందర్ పిచాయ్. ప్రపంచప్రఖ్యాత సంస్థకు సీఈవోగా అదృష్టంతో కాలేదు. ఆయన పడ్డ కష్టాలను తాజాగా ఏకరువు పెట్టాడు. అంత కష్టపడి అంత ఎత్తుకు ఎదిగిన సుందర్ పిచాయ్ స్టోరీ ఆ విద్యార్థులకు కన్నీళ్లు పెట్టించింది.. స్ఫూర్తిని నింపింది. కరోనా-లాక్ డౌన్ అవకాశాలు లేవని మథనపడుతున్న వారికి కష్టాలతో ఎలా అధిగమించవచ్చో సుందర్ పిచాయ్ వివరించారు.

    2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాను ఈ స్థాయికి ఏదో ఊరికే అదృష్టంతో ఎదగలేదని.. ఎన్నో కష్టాలు.. టెక్నాలజీ అంటే తనకున్న పిచ్చి వల్ల ఇంత పెద్ద స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చాడు. సుందర్ పిచాయ్ చెప్పిన స్టోరీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.

    చెన్నైలో పుట్టిపెరిగిన సుందర్ పిచాయ్ ఐఐటీ గ్రాడ్యుయేట్ కాగా.. స్టాన్ ఫర్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2004లో గూగుల్ లో చేరి నేటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను తయారు చేసి ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన బ్రౌజర్ గా నిలిపాడు

    గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కరోనా-లాక్ డౌన్ వేళ విద్యార్థుల్లో అద్భుతంగా స్ఫూర్తి నింపారు. తన చిన్నతనంలో ఎంత కష్టపడ్డది.. తాను గూగుల్ సీఈవో అయ్యే క్రమంలో పడ్డ కష్టాన్ని వివరించి అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. తన తండ్రి పడ్డ కష్టం గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

    మాతరం కనీసం కలలో కూడా ఊహించని కొత్తవాటిని ఈ తరం సుసాధ్యం చేయవచ్చన్నారు. గ్రాడ్యూయేట్లు ఆశావహంగా ఉండాలని.. సహనంతో ముందుకు సాగాలని సూచించారు. కరోనా-లాక్ డౌన్ తో కృంగిపోవద్దని.. ఏదీ శాశ్వతం కాదని.. కష్టాల నుంచే కొత్త దారులు వెతుక్కోవాలని సుందర్ వివరించారు.

    గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తాను కష్టపడ్డానని సుందర్ పిచాయ్ వివరించారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు అమెరికా వెళ్లేటప్పుడు విమాన టికెట్ కొనేందుకు తన తండ్రి ఏడాది జీతాన్ని ఖర్చు చేయాల్సి వచ్చిందని సుందర్ పిచాయ్ వివరించారు.

    అమెరికా అత్యంత ఖరీదైన ప్రాంతమని.. అప్పట్లో ఇంటికి ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చయ్యేవని.. బ్యాగ్ కొనాలంటే భారత్ లో తన తండ్రి నెలజీతం అంత మొత్తం వెచ్చించాల్సి వచ్చేదని తన అనుభవాలను పంచుకున్నారు.

    ఇలా తన కష్టాలను సుందర్ పిచాయ్ పంచుకొని అందరిలో స్ఫూర్తినింపారు. ఎంత ఎదిగినా తన ఎదుగుదల వెనుక తన తండ్రి కష్టం ఉందని వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకున్నారు. సుందర్ పిచాయ్ చెప్పిన ఆయన స్టోరీ ఇప్పుడు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోంది.

    -నరేశ్ ఎన్నం