Munugodu By Election: రాష్ర్టంలో మునుగోడు హీట్ మరింత పెరిగింది. బుధవారం టీఆర్ఎస్ నేత సీఎం ఆ ప్రాంత పార్టీ ముఖ్య నేతలు, పార్టీ ప్రముఖులతో నిర్వహించిన కీలక సమావేశం మరింత ఆజ్యం పోసింది.. మునుగోడు స్థానాన్ని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అనుచరుల ద్వారా తెలుస్తున్నది. పట్టుకోసం పలు కీలక విషయాలు చర్చించారు.
-కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జీవితం
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యాదాద్రి, భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలోని జంగారెడ్డి-కమలమ్మ దంపతులకు 1965లో జన్మించాడు. బీఈడీ పూర్తి చేసిన ఆయన ఉపాధ్యాయుడిగా పని చేసి సొంత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
తెలంగాణ ఉద్యమం నడుస్తున్న దశలో 2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనేక ఉద్యమాల్లో ప్రముఖంగా పాల్గొన్నాడు. ఉద్యమం కోసం పని చేసిన వారిలో అక్కడి ప్రాంతంలో కీలకంగా పని చేసిన నేతల్లో ఇతనూ ఒకరు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎనిమిదో స్థానానికి పరిమితమైన ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో 38వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందాడు. తర్వాతి వచ్చిన మార్పుల దృష్య్టా 2018లో కోమటిరెడ్డిపై 22 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
Also Read: Chiranjeevi Arrival Benit for Pawan Kalyan: చిరంజీవి రాక పవన్ కళ్యాణ్‌కి లాభమా..? నష్టమా…?
-ప్రధాన పార్టీ గెలుపు ఖాయమా?
మునుగోడు రాజకీయం రోజుకో ములుపుతిరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పటి నుంచి అటు బీజేపీ ఆ స్థానం తమదే అంటూ ట్రిపుల్ ఆర్ కు మరో ఆర్ తోడవుతాడని ప్రచారం జోరు పెంచింది. నోటిఫికేషన్ రాకముందే పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలు బల నిరూపణకు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాయి.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తమ అభ్యర్థి అని టీఆర్ఎస్ బుధవారం చెప్పకనే చెప్పింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనౌన్స్ మెంట్ ఉంటుందని పార్టీ నాయకుడు కేసీఆర్ కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు.
2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర ఓటమి పాలైన ప్రభాకర్ రెడ్డిని మళ్లీ అదే స్థానం నుంచి నిలబెడితే ప్రస్తుత పరిస్థితుల్లో నెగ్గుకురాగలడా అన్న సందేహం పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తు్ంది. దాదాపు 9 ఏండ్ల సుధీర్ఘ టీఆర్ఎస్ పాలనపై ఎంతో కొంత వ్యతిరేకత మూటగట్టుకున్న టీఆర్ఎస్ మరోమారు మునుగోడుతో తప్పు చేస్తుందని చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. మునుగోడులో దాదాపు నాలుగేండ్ల పాలనపై పట్టు కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన అభ్యర్థిని బరిలోకి దింపి సాహసమే చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-గిరిజన బంధు గట్టెక్కించేనా..
హుజూరాబాద్ ఎన్నికల్లో అవలంభించిన స్ర్టాటజీని మునుగోడులో కూడా అవలంభించాలని సీఎం చూస్తున్నట్లు తెలుస్తుంది. అప్పటి హుజూరాబాద్ ఎన్నికల్లో దళిత బంధును తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు దూరం పెట్టి బీజేపీని అక్కున చేర్చుకున్నారు. అభ్యర్థిని చేసే ఓట్లు పడ్డాయని, బీజేపీని ఎవరూ చూడలేదని అప్పటి నాయకులు గగ్గోలు పెట్టినా.. అలాంటి వ్యక్తిని పార్టీ ఎందుకు దూరం పెట్టిందని ప్రశ్నించిన వారూ లేకపోలేదు. ఇక మునుగోడు విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా అక్కడ ఆయనకు గుర్తింపు ఉంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
జాతీయ సమైక్యతా సభలో ఆగమేఘాల మీద తీసుకచ్చిన గిరిజన బంధు కూడా ఈ స్ర్టాటజీ కిందకే వస్తుందని చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే పథకంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కేసీఆర్ ఆదేశించినా హుజూరాబాద్ ఉదంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. మరో వైపు గిరిజన బంధుపై ప్రజలకు వివరించాలన్న కేసీఆర్ బీసీ, దళిత, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తే బాగుండని, మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించి గిరిజన బంధుపై ప్రచారం చేయడం ఇబ్బందిగా ఉంటుందని పార్టీ శ్రేణులు బాస్ ముందు చర్చించేందుకు భయపడడం విశేషం.
ఏది ఏమైనా టీఆర్ఎస్ పథకాలు పార్టీని ఏమేరకు ముందుకు తీసుకెళ్తాయో.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మునుగోడు తేల్చనుందని వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొటున్నారు.
Also Read:Janasena Chief Pawan Kalyan: ఆ నేతలను పవన్ టార్గెట్ చేశారా?
Recommended videos: