Bigg Boss Telugu 6- Sri Satya: లేడీ కంటెస్టెంట్ శ్రీసత్య తెగింపుకు ఆడియన్స్ షాక్ అయ్యారు. ఆమె ఏకంగా హోస్ట్ నాగార్జుననే టార్గెట్ చేయడం సంచలనమైంది. గీతూ రాయల్ పై కోపాన్ని ఆమె నాగార్జున మీద చూపించింది. విషయంలోకి వెళితే పోయిన వారం నాగార్జున ఇచ్చిన బూస్ట్ బాగా పని చేస్తుంది. కంటెస్టెంట్స్ విపరీతంగా గొడవలు పడుతున్నారు. హౌస్ లో ప్రశాంతంగా ఉంటే కుదరదని నాగార్జున హెచ్చరించిన నేపథ్యంలో అవసరం ఉన్నా లేకున్నా… కొట్టుకోవడం, తిట్టుకోవడం చేస్తున్నారు. సోమవారం జరిగిన నామినేషన్స్ లో ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.

మంగళవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ కూడా వాడివేడిగా సాగుతుంది. కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేయడం కోసం ‘అడవిలో ఆట’ అనే టాస్క్ బిగ్ బాస్ నిర్వహించాడు. దీని కోసం కంటెస్టెంట్స్ ని పోలీసులుగా, దొంగలుగా విభజించాడు. గీతూ రాయల్ ని మాత్రం అవినీతి వ్యాపారస్తురాలిగా ఎంపిక చేశాడు. వస్తువులు దొంగిలించకుండా పోలీసులు దొంగలను అడ్డుకోవాలి. ఇక దొంగల వద్ద గీతూ వస్తువులు కొంటుంది. ఈ టాస్క్ లో గీతూ తీరును శ్రీసత్య తప్పుబట్టారు. గీతూ దొంగల వద్ద నుండి వస్తువులు కొనకుండా ఆమె కూడా దొంగిలిస్తున్నారని శ్రీసత్య ఆరోపించింది.
Also Read: Chiranjeevi Arrival Benit for Pawan Kalyan: చిరంజీవి రాక పవన్ కళ్యాణ్‌కి లాభమా..? నష్టమా…?
అది నా గేమ్ స్ట్రాటజీ అని గీతూ సమాధానం చెప్పింది. ఆమె ఎలా ఆడినా బిగ్ బాస్ ఏమీ అనడం లేదు. అయితే గేమ్ గీతూతోనే ఆడుకో బిగ్ బాస్ అని శ్రీసత్య అసహనం వ్యక్తం చేసింది. నేను వస్తువులు దొంగిలించలేదు. శ్రీహాన్ వద్ద కొన్నానని గీతూ చెప్పడంతో శ్రీహాన్ సైతం షాక్ అయ్యాడు. గీతూ ఫెయిర్ గా ఆడటం లేదని భావించిన శ్రీసత్య ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జునపై ఆమె సెటైర్ వేశారు. ఇలా ఆడితేనే కదా చప్పట్లు కొట్టించేది అంటూ వ్యంగంగా మాట్లాడింది.

శనివారం ఎపిసోడ్ లో నాగార్జున దాదాపు అందరు కంటెస్టెంట్స్ ని తిట్టాడు. గీతూ రాయల్ ని మాత్రం పొగిడాడు. ఆమె అద్భుతమైన గేమ్ ఆడిందన్న నాగార్జున గీతూని అభినందించిన చప్పట్లు కొట్టాడు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ సత్య ఈ కామెంట్ చేశారు. హౌస్ లో ఉండి హోస్ట్ పై ఈ తరహా ఆరోపణలు చేయడం నిజంగా సాహసమే. అంత ధైర్యం ఎవరికీ ఉండదు. బయటికి వచ్చాక ఎన్నైనా చెబుతారు. షోలో ఉండగా హోస్ట్ ని విమర్శిస్తే పరిణామాలు దారుణంగా మారవచ్చు. ఇక శ్రీసత్యను నాగార్జున బాగా తిట్టిన విషయం తెలిసిందే. తిండి కోసం గేమ్ కూడా వదిలేస్తున్నావంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అది కూడా ఆమె కోపానికి కారణం కావచ్చు.
Also Read: RRR Oscar- Rajamouli: ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ అందుకునే సీన్ లేదు… ఇదంతా రాజమౌళి మాస్టర్ ప్లాన్!
Recommended videos:


[…] Also Read: Bigg Boss Telugu 6- Sri Satya: ఇదేం సాహసం బాబోయ్… హోస్ట్… […]