https://oktelugu.com/

Ram Charan- Jr NTR Enter Politics: రాజకీయాల్లోకి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌.. పోటీ ఎక్కడి నుంచంటే?

Ram Charan- Jr NTR Enter Politics: ట్రిపుల్‌ ఆర్‌ స్టార్‌.. ఎన్టీఆర్, రామ్‌చర ణ్‌తేజ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబొతున్నారా అంటే పొలిటికల్‌ సర్కిల్‌ నుంచి అవుననే సమాధానం వస్తోంది. సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు.. అయితే గతంలో సినిమాలో ఒకస్థాయికి వచ్చిన తర్వాత పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చేవారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, చిరంజీవి వరకు ఇదే జరిగింది. సినీరంగంలో ఒక స్టేటస్‌ వచ్చిన తర్వాతనే వీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నేటితరం హీరులో మాత్రం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 21, 2022 / 03:38 PM IST
    Follow us on

    Ram Charan- Jr NTR Enter Politics: ట్రిపుల్‌ ఆర్‌ స్టార్‌.. ఎన్టీఆర్, రామ్‌చర ణ్‌తేజ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబొతున్నారా అంటే పొలిటికల్‌ సర్కిల్‌ నుంచి అవుననే సమాధానం వస్తోంది. సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు.. అయితే గతంలో సినిమాలో ఒకస్థాయికి వచ్చిన తర్వాత పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చేవారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, చిరంజీవి వరకు ఇదే జరిగింది. సినీరంగంలో ఒక స్టేటస్‌ వచ్చిన తర్వాతనే వీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నేటితరం హీరులో మాత్రం నాలుగైదు సినిమాలు హిట్‌కాగానే రాజకీయాలపై దృష్టిపెడుతున్నారు. తమిళ హీరో విశాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కొడుకు ఉదయనిధి ఇలాగే రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని ఆలోచించి తర్వాత ఉపసంహరించుకున్నారు. తాజాగా పొలిటికల్‌ తెరపై తెలుగు స్టార్‌ హీరోలు రామ్‌చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు మాత్రం పొలిటికల్‌ ఎంట్రీ కొత్తే.

    Ram Charan- Jr NTR

    ఏ హీరో ఏ పార్టీలోకో..
    ఇప్పుడు ఏ హీరో ఏ పార్టీ లోకి వెళతాడు, ఏ పార్టీకి సపోర్ట్‌ చేస్తూ ప్రచారం చేస్తాడు అనే విషయమై ప్రజల్లో చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే సినిమా ప్రముఖుల రాజకీయ ఆలోచనలు, వాళ్లు చేసే పనులు అందరిలో ఆత్రుతని కలిగించేవిలా కనిపిస్తున్నాయి. ఆమధ్య టాలీవుడ్‌ లోని ప్రముఖులు చాలామంది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఏపీ రాజకీయాల్లో సినీ ప్రముఖుల పాత్రపై సర్వత్రా ఆసక్తి ¯మొదలైంది. కాగా, ఈమధ్యన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కలిశారు. ఇది రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఎన్టీఆర్‌ బీజేపీకి మద్దతు ఇవ్వడం ఖాయమంటూ మీడియాలోనూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. ఈలోపే ఎన్టీఆర్‌పై టాలీవుడ్‌ గుస్సా అయింది. ఎన్టీఆర్‌ – బీజేపీ మైత్రి చూసి టీఆరెస్‌ ప్రభుత్వానికి కాలింది. అందుకే ఎన్టీఆర్‌ గెస్ట్‌గా జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఆపేసింది. కాగా, ఎన్టీఆర్‌ – బీజేపీ కలయికపై ఎలాంటి స్పష్టత లేదు. 2024 నాటికి మాత్రం యంగ్‌టైగర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమంటున్నారు విశ్లేషకులు. కృష్ణ లేదా గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తారన్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

    Also Read: Munugodu By Election: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి అతనే..

    జనసేనలోకి మెగాపవర్‌స్టార్‌..
    వచ్చే సాధారణ ఎన్నికల నాటికి మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా రాజకీయాల్లోకి రావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ పవన్‌ సారథ్యంలోని జనసేనకు పరోక్షంగా అండగా ఉంటుంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి కూడా తాజాగా ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నానుంచి దూరం కాలేదు’ అనే గాడ్‌ఫాదర్‌ సినిమా డైలాగ్‌ను విడుదల చేసి పొలిటికల్‌ హీట్‌ పెంచారు. తన పొలిటికల్‌ రీఎంట్రీ ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌ కూడా రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. మెగాస్టార్‌ చిరు తమ్ముడికి డైరెక్ట్‌ గా సపోర్ట్‌ ఇవ్వకపోయినా.. ఆయన సపోర్ట్‌ జనసేనకే. ఆయన ఫ్యామిలీ సపోర్ట్‌ పవన్‌ కళ్యాణ్‌ కే. ఈ నేపథ్యంలో మెగాపవర్‌ స్టార్‌ పొలిటికల్‌ ఎంట్రీ కూడా జనసేన నుంచే ఉంటుందని తెలుస్తోంది. అంతటితో ఆగకుండా ఆయన జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి బరిలో దిగుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి.

    Ram Charan- Jr NTR

    ఎవరికీ సమస్య రాకుండా..
    యంగ్‌టైగర్, మెగాపవర్‌స్టార్‌ పొలిటికల్‌ ఎంట్రీతో ఇద్దరు హీరోల అభిమానుల్లో ఎవరికీ ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ కలిసే ప్రయాణిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీచేస్తామని ఇటు కమలనాథులు, అటు జనసేనాని ప్రకటించారు. ట్రిపులార్‌ హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ బీజేపీలోకి, రామ్‌చరణ్‌ జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం జరగుతోంది. ఇదే నిజమైంతే ప్రచారం పరంగా కానీ, రాజకీయ విమర్శల పరంగా కానీ ఎవరికీ ఇబ్బంది ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ బీజేపీని కలిపే పనిలో జనసేనాని ఉన్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల నుంచి కూడా ఎలాంటి సమస్య ఉండదని తెలుస్తోంది. మొత్తంగావచ్చే ఎన్నికల్లో రామ్‌ చరణ్‌–ఎన్టీఆర్‌ ముఖ్యపాత్ర పోషిస్తారంటూ వస్తున్న వార్తలు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

    Also Read:Chiranjeevi Arrival Benit for Pawan Kalyan: చిరంజీవి రాక పవన్‌ కళ్యాణ్‌కి లాభమా..? నష్టమా…?  

    Recommended videos:

    Tags