mudragada padmanabham: ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే పార్టీల్లో ఉన్న సిద్ధాంతాల దృష్ట్యా కుల ముద్రలు వేయించుకున్న సందర్భంలో ప్రస్తుతం కులాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ కాపు వర్గంగా జనసేన పార్టీ స్థాపించినా ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేకుండానే చూసుకుంటున్నారు. కానీ ఆయనపై కాపు ముద్ర పడిపోయింది. టీడీపీకి అయితే కమ్మ సామాజిక వర్గ ముద్ర ఏనాడో పడిపోయింది. జగన్ అయితే రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాస్ర్టంలో కుల ప్రధానంగా పార్టీల మనుగడ సాగుతోందని తెలుస్తోంది. ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ కూడా కాపు సామాజిక వర్గం సమావేశానికి హాజరు కావడంతో ఆయనపై కూడా కుల ముద్ర పడింది.
కాపుల ఆరాధ్యుడిగా భావిస్తున్న ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో కాపు సామాజికవర్గం ఓట్లు చీలకుండా తమకే పడాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ సైతం కాపులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో ముద్రగడ వ్యూహాలు ఏ మేరకు పనిచేస్తాయనేదే ప్రశ్న. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో కాపులకు సీఎం పదవి ఉండాలనే ఉధ్దేశంతోనే వారు పోరు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు.. కానీ వారికి జగన్ అందలం?
ప్రస్తుతం రాష్ర్టంలో పొత్తుల కాలం నడుస్తోంది. బీజేపీ-జనసేన పొత్తు ఉన్నందున రాబోయే ఎన్నికల నాటికి మరిన్ని పొత్తులు పెట్టుకోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. జనసేన కేవలం రెండు జిల్లాల్లోనే ప్రభావం చూపుతుందని అంచనాలు వేస్తున్న సందర్భంలో ముద్రగడ పార్టీ మనుగడ సాధిస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుందని తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభం కాపుల ఐక్యతకు పాటుపడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి కాపుల ఓట్లు చీలిపోకుండా చూసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ముద్రగడ పార్టీతో రాష్ర్టంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును సీఎం కానివ్వొద్దనే ఉద్దేశంతోనే ముద్రగడ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ముద్రగడకు బాబుకు మధ్య పెద్ద రాజకీయ దుమారమే రేగింది. దీంతో ఆయనను భవిష్యత్ లో సీఎం కానివ్వబోనని బీష్మించుకున్నట్లు కాపు వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
Also Read: టార్గెట్ బీజేపీ.. సీఎం కేసీఆర్‌తో తేజస్వి యాదవ్ కీలక భేటీ.. జాతీయ రాజకీయాలపై ఫోకస్