https://oktelugu.com/

Trisha: రెడీ అంటున్న త్రిష.. త్వరగానే కోలుకుంది !

Trisha: స్టార్ హీరోయిన్ త్రిష కూడా కొన్ని రోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే, త్రిష ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో తన హెల్త్ కి సంబంధించి అప్ డేట్ ఇస్తూ.. ‘నాకు కరోనా నెగిటివ్ వచ్చింది, నేను నెగిటివ్ అయ్యాను, . మొదటిసారిగా నేను నెగిటివ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు నేను 2022 సంవత్సరానికి రెడీగా ఉన్నా’ అంటూ తన లేటెస్ట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 12, 2022 / 11:06 AM IST

    Trisha

    Follow us on

    Trisha: స్టార్ హీరోయిన్ త్రిష కూడా కొన్ని రోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే, త్రిష ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో తన హెల్త్ కి సంబంధించి అప్ డేట్ ఇస్తూ.. ‘నాకు కరోనా నెగిటివ్ వచ్చింది, నేను నెగిటివ్ అయ్యాను, . మొదటిసారిగా నేను నెగిటివ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు నేను 2022 సంవత్సరానికి రెడీగా ఉన్నా’ అంటూ తన లేటెస్ట్ ఫోటో పోస్ట్ చేస్తూ అసలు విషయం చెప్పింది ఈ చెన్నై బ్యూటీ.

    Trisha

    అన్నట్టు త్రిషతో పాటు ప్రముఖ నటుడు సత్యరాజ్ కు కూడా కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాకపోతే చెన్నైలో చికిత్స పొందుతున్న సమయంలో ఓ దశలో సత్యరాజ్ బాగా కాస్త క్షీణించింది కూడా. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    Also Read:  ‘పుష్ప-2’ స్టోరీ లైన్ లీక్.. టర్నింగ్ పాయింట్ అదే..!

    ఏది ఏమైనా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు ఇలా వరుసగా కరోనా పాజిటివ్ అని తేలుతుంది. ఇప్పటికే కరోనా బారిన పడిన సినీ ప్రముఖుల లిస్ట్ భారీగా ఉంది. మొత్తానికి కరోనా భయం మళ్ళీ మొదలైంది. అసలు మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కరోనా కారణంగా షూటింగ్స్ కి కూడా బ్రేక్ ఇచ్చారు.

    Also Read:  జనసేనాని దారెటు: కలిస్తే గెలుస్తారు.. కలవకపోతే అధికారం కల్లేనా?

    Tags