https://oktelugu.com/

Pushpa-2: ‘పుష్ప-2’ స్టోరీ లైన్ లీక్.. టర్నింగ్ పాయింట్ అదే..!

Pushpa-2 Story: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు దర్శకుడు సుకుమార్ ముందుగానే ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగా మొదటి పార్ట్ ను ‘పుష్ప.. ద రైజ్’ పేరుతో డిసెంబర్ 17న థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్యాన్ ఇండియా లెవల్లో ‘పుష్ప-1’ భారీ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది. ‘పుష్ప’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు సాధించగా హిందీ మాత్రం వంద కోట్ల మార్క్ దిశగా వెళుతుండటం విశేషం. అలాగే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 12, 2022 / 10:35 AM IST
    Follow us on

    Pushpa-2 Story: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు దర్శకుడు సుకుమార్ ముందుగానే ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగా మొదటి పార్ట్ ను ‘పుష్ప.. ద రైజ్’ పేరుతో డిసెంబర్ 17న థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్యాన్ ఇండియా లెవల్లో ‘పుష్ప-1’ భారీ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది.

    Pushpa

    ‘పుష్ప’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు సాధించగా హిందీ మాత్రం వంద కోట్ల మార్క్ దిశగా వెళుతుండటం విశేషం. అలాగే ఓవర్సీస్, యూఎస్ లోనూ ‘పుష్ప’ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు. దీంతో ‘పుష్ప’ సెకండ్ పార్ట్ కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ‘పుష్ప.. ద రూల్’ అనే పేరుతో సెకండ్ పార్ట్ తీసుకు రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

    ఈ నేపథ్యంలోనే ‘పుష్ప-2’కు సంబంధించిన స్టోరీ లైన్ బయటికి వచ్చింది. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ ను దర్శకుడు సుకుమార్ రూలర్ గా చూపించబోతున్నాడు. మొదటి పార్ట్ లో అల్లు అర్జున్ విలన్ తో పోరాటం, సిండికేట్లో పుష్ప రూలర్ గా మారాడాన్ని చూపించారు. అయితే రెండో పార్ట్ లో మాత్రం ఎమోషనల్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

    తల్లి సెంటిమెంట్ ను ‘పుష్ప-2’లో టర్నింగ్ పాయింట్ గా మారబోతుందనే టాక్ విన్పిస్తోంది. తనను కాదన్న అన్నలను పుష్పరాజ్ ఎలా దారికి తెచ్చాడనేది కథలో భాగం కానుందట. భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేలా పార్ట్ 2 ఉండబోతుందని సమాచారం. విలన్లతో పుష్ప రాజ్ పోరాటాలు హైలెట్ గా ఉండనున్నాయట. మొత్తానికి దర్శకుడు సుకుమార్ ‘పుష్ప-2’కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.