Samantha: సమంత కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ.. సమంత నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆతర్వాత తమిళ్ లోనూ ఈ బ్యూటీ ఆఫర్లు అందుకుంది. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని చూస్తుంది ఈ అమ్మడు. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది సమంత. ఈ వెబ్ సిరీస్ హిట్ అవ్వడంతో మరికొన్ని ఆఫర్స్ వస్తున్నాయి ఈ ముద్దుగుమ్మకు. ఇటీవలే హాలీవుడ్ మూవీ కి ఒకే చెప్పినట్లు అధికారికంగా ప్రకటించింది.

కాగా సోషల్ మీడియాలో కూడా సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను పలకరిస్తుంది సమంత. ఇక సమంత సోషల్ మీడియా లో అందమైన ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఇక ఇటీవలే భర్త నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ వస్తుంది సామ్. రకరకాల కొటేషన్స్ షేర్ చేస్తూ పోస్టింగ్ లు చేస్తుంది సమంత. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ఘనతను సాధించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. సమంత ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్ లకు చేరడంతో ఆమె యాడ్ పోస్ట్ రేటు భారీగా పెరుగుతుందట. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమా త్వరలోనే విడుదల కానుంది.
