MP Arvind- CM KCR: తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. విమర్శల దాడి క్రమం తప్పుతోంది. మానసిక స్థితి సరిగా లేక నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ వరదలు విదేశీయుల కుట్రగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ కు పిచ్చిపట్టినట్లుగా ఉందని చెబితే ఊరుకుంటారా? ఆయన చేసిన ఆరోపణలో ఏదైనా ఆధారం ఉందా? సాంకేతికత తోడైందా? ఎందుకంత హీనంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన మానసిక పరిపక్వత దెబ్బతిందని అర్థమవుతోంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడం సీఎం బాధ్యత. బాధితులను ఓదార్చి వారికి సరైన సేవలు చేయడం ఆయన విధుల్లో భాగమే. ప్రకృతి వైపరీత్యాలను విదేశీ కుట్రలుగా మార్చడం ఒక సీఎంకే చెల్లింది. ఈయన రాష్ట్రానికి సీఎం కాదు కేంద్రానికి కూడా సలహాదారుగా ఉంటే బాగుండేదేమో.
సీఎం మానసిక స్థితిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించను. ఆయన మానసిక స్థితి బాగుండట్లేదు. కుటుంబ రాజకీయాలో, లేక తాజా రిపోర్టులో కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాటల్లో పొంతన లేని సమాధానాలు వస్తున్నాయి. బీజేపీని విమర్శించాలనే ఉద్దేశంతో ఆయన విదేశీ కుట్ర అనే పదాలు వాడటం ఆయనకే సొంతం. ఆయన వ్యక్తిగతానికే వదిలేస్తున్నామని అర్వింద్ పేర్కొన్నారు.
Also Read: Janasena Chief Pawan Kalyan: జనసేన’పై పెరుగుతున్న ఇంట్రెస్ట్..: అసంతృప్తి నాయకులంతా పవన్ వైపు..?
కేసీఆర్ స్థితిపై విచారం వ్యక్తం చేసిన అర్వింద్ కూడా ఆయన మెంటల్ కండిషన్ పై ఆవేదన వ్యక్తం చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. కేసీఆర్ పై భయంతో ఈ మాటలన్నారా? లేక సీఎం మానసిక పరిస్థితిపై మాట్లాడారా? అనేది తేలాల్సి ఉంది. కొద్దిరోజులుగా నిజామాబాద్ లో ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి రైతులు ఎంపీని అడ్డుకుని ఆయనపై దాడికి యత్నించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కేసీఆర్ కు భయపడుతున్నారా అని అందరిలో సందేహాలు వస్తున్నాయి.
రాజకీయాలను కేసీఆర్ ఎటు వైపు తీసుకెళ్తారో కూడా అర్థం కావడం లేదు. ఏది పడితే అది మాట్లాడటం ఆయనకే చెల్లుతుంది. ఏ మాత్రం ఆధారం లేని మాటలు మాట్లాడుతూ చిన్న పిల్లవానికంటే తక్కువగా చేసుకుని తన స్థాయికి మచ్చతెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. శాస్త్ర , సాంకేతికత ఇంత పరిణతి చెందుతున్నా నేతలు మాత్రం అక్కడే ఉంటున్నారు. అవే విమర్శలు అవే చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ మాటలు విదేశీయులు వింటే ఆశ్చర్యపోతారు. వర్షాలకు వారికి ఏంటి సంబంధం? సీఎం కేసీఆర్ కొంచెం నోరు అదుపులో ఉంచుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు చాలా మందిలో వస్తున్నాయి.
Also Read:Political Survey Report in AP: సర్వేల నగ్న సత్యాలు.. గ్రౌండ్ రియాలిటీలో వైసీపీ పరిస్థితి ఇదా?