UP Elections 2022: దేశంలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఇప్పటికే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అన్నిపార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. కానీ అందరి జాతకాలు అసహ్యంగా ఉన్నాయి. అందరూ నేరస్తులే. దీంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. రాజకీయమంటే నేరస్తులకు స్వర్గధామంగా మారుతోంది. ఏ నేరం చేసైనా రాజకీయాల్లో చేరి తమ పలుకుబడి ఉపయోగించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కావడం తెలిసిందే.

ఉత్తరప్రదేశ్ లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది పలు నేరాల్లో భాగస్వామ్యం ఉండటం గమనార్హం. దీంతో వీరు ప్రజా సేవలో ఎలా తరిస్తారు? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. నేరస్తులు ఇంకా నేరాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ఎందుకు పాటుపడతారనే సంశయాలు నెలకొన్నాయి. గతంలో కూడా ఇలా నేరస్తులే ఎక్కువగా రాజకీయాల్లోకి రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కూడా ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి నేరగాళ్లే పోటీలో ఉండటంతో ఇక పనులు మాత్రం ఎక్కడికక్కడే ఉంటాయని తెలుస్తోంది.
Also Read: ఆన్ లైన్ క్లాసులపై హైకోర్టు కీలక ఆదేశాలు
అన్ని రాజకీయ పార్టీలు కూడా నేరస్తులకే పెద్దపీట వేస్తూ టికెట్లు ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వారికే టికెట్లు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. అందుకే అన్నింట్లోనే నేరస్తులే ఉండటంతో ఇక ఏం చేసినా లాభం లేదని చెబుతున్నారు. దొంగకే తాళం చెవి ఇస్తే ఇక దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు.
హత్యలు, మానభంగాలు, దోపిడీలుచేసిన వారు చట్టసభలకు వెళ్తే ఇంకేముంటుంది. నేరస్తులతో చట్టసభలు నిండిపోనున్నాయి. దీంతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. నిజమైన నాయకులకు బదులు గుండాలు, రౌడీలు, నేరస్తులే ప్రాతినిధ్యం వహించడం దౌర్భాగ్యం. దీంతో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఇలాగే నేరస్తులే నేతలుగా రానుండటం తెలిసిందే. దీంతో దేశంలో రాజకీయ నేతల్లో ఎక్కువ మంది నేరస్తులే ఉండటంతో విలువలు ఎలా మనగలుగుతాయని ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: రాజ్యాంగంపై కేసీఆర్ మాటల్లో ఆంతర్యమేమిటి? వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
[…] […]