Homeఆంధ్రప్రదేశ్‌Southwest Monsoon: మందగించిన నైరుతి..11 తరువాత చురుగ్గా మారే అవకాశం

Southwest Monsoon: మందగించిన నైరుతి..11 తరువాత చురుగ్గా మారే అవకాశం

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు మందగించాయి. ఫలితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జాడలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సమీపిస్తుండడంతో భయం వారిని వెంటాడుతోంది. వరి ఆకుమడులు వేయాలో వద్దా అని డిఫెన్స్ లో పడిపోయారు. సాధారణంగా జూన్‌ 1న కేరళలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది మే 29కే వచ్చాయి. అప్పటికే రుతుపవనాల కరెంట్‌ బలహీనంగా ఉన్నప్పటికీ పడమర గాలులు, కేరళలో పలుచోట్ల వర్షాలు కురవడాన్ని ప్రాతిపదికగా తీసుకుని నైరుతి రాకను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఖరారు చేసింది. దీనిపై పలువురు వాతావరణ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐఎండీ అప్రమత్తమై.. రుతుపవనాల రాకలో అన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తర్వాత ఈశాన్య భారతంలో అన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ దక్షిణాదిలో బెంగళూరు, ధర్మపురి వరకే వచ్చాయి. హిందూ మహాసముద్రంలో ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌, మేడిన్‌ జూలియన్‌ అస్లిలేషన్‌ అనుకూలంగా లేనందున నైరుతిలో మందగమనం కనిపిస్తోందని నిపుణులు అంచనావేశారు. అరేబియా సముద్రం మీదుగా వచ్చే పడమర గాలులు కూడా బలహీనంగా ఉన్నాయని విశ్లేషించారు. అయితే రానున్న రెండు, మూడు రోజుల్లో రుతుపవనాల్లో కొంచెం కదలిక రావొచ్చని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. దీంతో ఈనెల ఎనిమిది నుంచి కర్ణాటక, దానికి ఆనుకుని రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, అదే సమయంలో వర్షాలు పెరుగుతాయని అన్నారు.

Southwest Monsoon
Southwest Monsoon

కేరళాలను తాకిన పవనాలు..
మూడు రోజులు ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజుల నుంచి స్థిరంగా ఉన్నాయి. కేరళలో పూర్తిగా, తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను తాకిన రుతుపవవనాలు.. ఈశాన్య భారతంతోపాటు పశ్చిమబెంగాల్‌లో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయి. ఇక జూన్‌ 4కల్లా తమిళనాడులో అన్ని ప్రాంతాలకు విస్తరించి చెన్నై వరకు రావల్సి ఉంది. ఇదే సమయంలో రాయలసీమలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాలి. ఏపీలో ఒంగోలు, తెలంగాణలో హైదరాబాద్‌కు ఈనెల ఎనిమిదికి రుతుపవనాలు రావాలి. అయితే దక్షిణాదిలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంతోపాటు ఇప్పటి వరకు తాకిన ప్రాంతాల్లో నైరుతి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడంలేదు. దక్షిణాదిలో రుతుపవనాల విస్తరణ, వర్షాలకు అనువైన వాతావరణం లేకపోవడంతో కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల ఎండలు మండుతున్నాయి. కాగా కేరళకు రుతుపవనాలు వచ్చాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన వెంటనే దక్షిణాదితోపాటు పశ్చిమ భారతంలో రైతులు ఖరీఫ్‌ పనులకు సన్నద్ధమయ్యారు. అయితే రుతుపవనాలు ముందుకు కదలకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.రాయలసీమలో రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా మారుతుందని దీంతో ఈనెల ఎనిమిది లేదా తొమ్మిదిన అనంతపురం, కర్నూలుకు తొలుత రుతుపవనాలు వస్తాయని అన్నారు. ఇంకా ఈనెల 11న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఒకటి రానున్నందున ఆ తర్వాత దక్షిణాదిలో రుతుపవనాలు బలపడతాయని పలు మోడల్స్‌ చెబుతున్న విషయాన్ని ఇస్రో నిపుణుడు చెప్పారు. దీంతో ఈనెల 11న కోస్తా, 12 నాటికి ఉత్తరకోస్తా వరకు రుతుపవనాలు విస్తరించడంతోపాటు ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్నారు.

Southwest Monsoon
Southwest Monsoon

స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మేలో ఎండలు స్వల్పంగా తగ్గాయి. మే నెలలో ఎండలపై ఐఎండీ ఆదివారం బులెటిన్‌ విడుదల చేసింది. 1981 నుంచి 2010 వరకు నమోదైన గరిష్ఠ, కనిష్ఠ ఉష్టోగ్రతల సగటును ప్రామాణికంగా తీసుకుంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.17 డిగ్రీలుకాగా ఈ ఏడాది మే నెలలో 35.07 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.84 కాగా 24.32 నమోదైంది. ఇదే సమయంలో మే నెలలో సాధారణ వర్షపాతం 62 మి.మీ.లకుగాను 83.4 మి.మీ.లు నమోదైంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాదిలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. స్కైమెట్‌నైరుతి రుతుపవనాలు గత నెల 29నే కేరళను తాకాయి. దీంతో దక్షిణ భారతంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంతా భావించారు. కానీ ఈ వారంలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చని ప్రైవేట్‌ వాతావరణ అంచనా ఏజెన్సీ స్కైమెట్‌ తెలిపింది. దక్షిణ భారతంలో రుతుపవనాల కార్యకలాపాల్లో గణనీయమైన పెరుగుదల ఉండకపోవచ్చని, ఈశాన్య భారతంలో మాత్రం వర్షాలు విస్తారంగా కురుస్తాయని స్కైమెట్‌ పేర్కొంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version