
Pawan Kalyan, Mohan Babu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్లు పోటీలో ఉన్నా అందరు కలిసి మాట్లాడుకోవడం కనిపించింది. ఎన్నికలు వేరు స్నేహాలు వేరు అన్నట్లుగా స్పందించారు. ఈ మేరకు పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే పవన్ కల్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చి మోహన్ బాబుతో సరదాగా మాట్లాడారు. తన ఓటు ప్రకాశ్ రాజ్ కే వేసినట్లు పేర్కొన్నారు. కానీ ఇద్దరు కలిసి చాలా సేపు ముచ్చటించారు.
మా ఎన్నికల్లో ఎవరిని ఎవరు టార్గెట్ చేయకూడదని తెలుసుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతోనే పవన్ కల్యాణ్, మోహన్ బాబు ఇద్దరు కలుసుకుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నారు. మా ఎన్నికల్లో పరస్పరం సహకారం అవసరమని గుర్తించారు. పోలింగ్ సందర్భంగా కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నా చివరికి ప్రశాంతంగానే ముగిసింది.
పోలింగ్ సమయం పొడిగింపుపై ఎన్నికల అధికారితో ఇరు ప్యానెళ్ల అభ్యర్థులు మాట్లాడి గంట సమయం పెంచారు. ఆలస్యంగా వచ్చే వారి కోసం అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి వారు కూడా అనుమతించి ఓటింగ్ నిర్వహించారు. దీంతో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. మొత్తానికి మా ఎన్నికల్లో ఎలాంటి గొడవలు లేకున్నా చిన్నపాటి ఘర్షణలతో ముగిసింది.
మా ఎన్నికల్లో 580 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 52 శాతం పోలింగ్ నమైదైనట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రం వద్ద పలువురు సీనియర్ నటులు సందడి చేశారు. ఓటు హక్కు వినియోగించుకుని తరువాత తమ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. రాత్రి 8 గంటల తరువాత ఎవరు విజయం సాధిస్తారోనని తేలనుంది.