Rakul Preet Singh: తన లవర్ అయిన హీరోని బయటపెట్టిన రకుల్..?

Rakul Preet Singh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటు తెలుగులోనూ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోను తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తను ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె ఎవరితో రిలేషన్ లో ఉన్నారు అనే విషయానికి వస్తే.. […]

Written By: Kusuma Aggunna, Updated On : October 10, 2021 5:15 pm
Follow us on

Rakul Preet Singh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటు తెలుగులోనూ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోను తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తను ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె ఎవరితో రిలేషన్ లో ఉన్నారు అనే విషయానికి వస్తే..

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈమె తనతో రిలేషన్ లో ఉన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా అతనితో కలిసి దిగినటువంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి ఫోటోను షేర్ చేస్తూ… థాంక్యూ మై లవ్ ఈ ఏడాదిలో నువ్వు నాకు ఎంతో విలువైన బహుమతి.. నా జీవితాన్ని ఎంతో ఆనందంగా అందంగా ఉంచినందుకు థాంక్స్ మై లవ్ అంటూ తను ప్రేమిస్తున్న విషయాన్ని బయటపెట్టారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియ చేయడమే కాకుండా పెళ్లెప్పుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం నటుడు జాకీతో రిలేషన్ లో ఉన్న రకుల్ ప్రీత్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందా అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో ఈమె నటించిన కొండపొలం పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది.