
Anchor Anasuya: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో కంటే ఈసారి పోలింగ్ పెరిగినా ఇంకా ఎక్కువ మంది ఓటింగుల పాల్గొనలేదని తెలుస్తోంది. జబర్దస్త్ వ్యాఖ్యాత, నటి అనసూయ పోలింగ్ లో పాల్గొనకపోవడం పలు చర్చలకు తావిస్తోంది. ఆమె ఎందుకు రాలేదు. కారణాలు ఏమై ఉంటాయని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓటు వేయడానికి రాకపోవడంపై అందరిలో చర్చ నెలకొంది.
అనసూయ(Anchor Anasuya) తన అందంతో, హావభావాలతో అందరిని ఆకట్టుకుంటోంది. మరోవైపు సినిమాల్లో బిజీ ఉంటోంది. దీంతో ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో కార్యవర్గ సభ్యురాలిగా పోటీ చేసింది. కానీ ఆమె ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం. అసలు ఆమె ఎందుకు ఓటు వేయడానికి రాలేదు. పోటీలో ఉండి కూడా ఎందుకు రాలేకపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంచు కుటుంబానికి కూడా దగ్గరగా ఉండే అనసూయ ఆయనపైనే పోటీకి నిలబడటంతో ఆమెకు ఇష్టం లేకనే రాకపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఓటు వేయడానికి రాకపోవడంపై పరిశ్రమలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 490 సభ్యులు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి.
అయితే మా ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తలు చోటుచేసుకున్నా పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే ముగిసింది. దీంతో తామే విజయం సాధిస్తామని అటు మంచు విష్ణు, ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ దీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం పెరిగినా ఇంకా ఎక్కువ మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం గమనార్హం.