https://oktelugu.com/

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

అధికారం మారుతున్న కాపుల తలరాతలు మారడం లేదు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కాపులు మారుతున్నారు. రాజకీయ అధికారం కాపులకు అందని ద్రాక్షగా మారుతోంది. ఎంత సేపు పార్టీల రాజకీయంలో కాపు నేతలు బలిపశువు అవుతూనే ఉన్నారన్న ఆవేదన క్షేత్రస్థాయి కాపునేతల్లో వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ అయినా.. వైసీపీ పార్టీ అయినా కాపులను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్న ఆవేదన ఆ వర్గంలో నెలకొంది. కాపు ఉద్యమ కారుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభం లాంటి వారు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 29, 2020 / 12:15 PM IST
    Follow us on


    అధికారం మారుతున్న కాపుల తలరాతలు మారడం లేదు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కాపులు మారుతున్నారు. రాజకీయ అధికారం కాపులకు అందని ద్రాక్షగా మారుతోంది. ఎంత సేపు పార్టీల రాజకీయంలో కాపు నేతలు బలిపశువు అవుతూనే ఉన్నారన్న ఆవేదన క్షేత్రస్థాయి కాపునేతల్లో వ్యక్తమవుతోంది.

    తెలుగుదేశం పార్టీ అయినా.. వైసీపీ పార్టీ అయినా కాపులను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్న ఆవేదన ఆ వర్గంలో నెలకొంది. కాపు ఉద్యమ కారుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభం లాంటి వారు కాపులను ఏకం చేసి వారిని రాజకీయ అధికారం దిశగా నడిపించాలని చూస్తున్నా కానీ కాపు నేతలు ఆయన వెంట నడవకుండా తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ, వైసీపీలో చేరుతున్నారు. వారికి ఈ రెండు పార్టీలు మంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవులు ఎరవేస్తూ వారిని మిన్నకుండేలా చేస్తున్నాయి. దీంతో కమ్మలు, రెడ్డిల కిందనే కాపులు మూడో తరగతి ప్రజలు జీవించాల్సిన దుస్థితి నెలకొంది.

    జగన్ కు కేసుల ఫీవర్ పోలేదా?

    ఏపీ రాజకీయాల్లో కాపులకు తమ కింద కీలక పదువులు ఆ నేతలను ఎదగనీయకుండా చేస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ, వైసీపీపై ఉన్నాయి.. కులాల కుంపట్లు ప్రతిపక్ష వైసీపీకి పోయిన ఎన్నికల్లో మేలు చేకూర్చాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎంతో మేలు చేకూర్చాయి. అయితే కాపుల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను ఎంచుకోవడంతో ఏపీలో కుల సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ఈ వర్గ పోరు, విభేదాలు జగన్ పార్టీకి ఊహించని వరంగా మారాయి..

    చంద్రబాబుతో విడిపోయి పవన్ కళ్యాణ్ వేరు కుంపటి పెట్టాడు. పవన్ సామాజికవర్గమైన కాపులు ఏపీలో దాదాపు 20శాతం మంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు పవన్ వెన్నంటే ఉన్నారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ ఇవ్వడంతో చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడా సామాజికవర్గం టీడీపీకి దూరమైంది. ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ఉద్యమ కారులు ఇప్పుడు చంద్రబాబు మోసాలపై ధ్వజమెత్తుతున్నారు..

    ఇక రెండో సమీకరణం.. కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం.. కన్నా సామాజికవర్గం నేతలు రెండుగా చీలిపోయారు. కొంతమంది కన్నా వెనుక ఉండగా.. మరికొందరు బీజేపీ ఏపీకి చేస్తున్న మోసంపై కన్నాకు దూరం జరిగారు. వీరంతా బీజేపీపై కోపంతో వైసీపీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

    జులై నుంచి కొత్త లాక్ డౌన్ రూల్స్?

    జగన్ పాదయాత్రలో కమ్మ సామాజికవర్గ నేతల సందడి ఎక్కువైంది. ఇన్నాళ్లు టీడీపీకి అండదండగా ఉన్న నాయకులు సైతం చంద్రబాబు వైఖరి నచ్చక వైసీపీలో చేరారు. కొడాలి నాని లాంటి వారు చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించి వైసీపీకి జైకొట్టారు. జగన్ పాదయాత్ర ముగిసే వరకు ఇంకా చాలా మంది కమ్మ నేతలు వైసీపీలో చేరేందుకు జిల్లాల వారీగా క్యూ కట్టారు.

    కాపు నేతలు కూడా చంద్రబాబు, పవన్ పార్టీ పాలిటిక్స్ నచ్చక వైసీపీలో చేరారు. పదువులు పొందారు. అయితే పదవులతోనే కాపులను కంట్రోల్ చేస్తున్నాయి పార్టీలు. అటు చంద్రబాబు, జగన్ చేతిలో కాపులు కీలు బొమ్మలు అయ్యారు. ఇప్పుడు కాపులకు అన్యాయంపై గళమెత్తే కాపు నేతలపై మంత్రి పదవులు పొందిన కాపు నేతలు కౌంటర్లిస్తున్నాయి. అధికార పార్టీలే ఇలా కౌంటర్లు ఇప్పిస్తున్నాయి. సొంత కాపు వర్గంపై అధికార యావతో కాపునేతలే ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పదవుల యావలో పడి కాపు సామాజికవర్గానికి సొంత పార్టీ నేతలే ద్రోహం చేస్తున్నారన్న ఆవేదన కాపుల్లో ఉంది.

    పవన్ కళ్యాణ్ కాపుల తరుఫున ఎంట్రీ ఇచ్చినా ఆయనపై నమ్మకం కాపుల్లో లేదు. అందుకే ఒంటరిగా 2019 ఎన్నికల్లో పోటీచేసినా ఆయనకు ఓట్లు పడలేదు. ఆయన కూడా గెలవలేదు. ఇప్పుడు కాపులు టీడీపీ, వైసీపీల మధ్యలో ఇరుక్కుపోయారు. బీసీలంటూ వీరికి డిప్యూటీ సీఎం పదవులు పార్టీలు ఎరవేస్తున్నాయి. వాటిని తీసుకొని కాపులకు కాపు నేతలే అన్యాయం చేస్తున్నారు.

    ఇక కాపు నేతలను కూడా ఎదగకుండా పార్టీలు పాత నేతలకు మంగళం పాడుతూ కొత్త నేతలను తెరపైకి తెస్తున్నాయి. ముద్రగడను పూర్తిగా పక్కనపెట్టి వైసీపీ కొత్త కాపు నేతలను తాజాగా మంత్రులను చేసింది. వారికి అధికారం అప్పగించింది. ఇక చంద్రబాబు కూడా పాత కాపులను వదిలించుకుంటూ కొత్తవారిని తెరపైకి తెస్తున్నారు. ఇలా కాపులు ఏకం కాకుండా.. ఉద్యమించకుండా పదవులు ఎరవేస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత అస్తిత్వం కోసం పోరాడకుండా కాపు నేతలు స్వార్థంతో పదవుల మాయలో సొంత సామాజికవర్గానికే అన్యాయం చేస్తున్నారన్న ఆవేదన ఆ వర్గంలో ఉంది. ఇప్పటికైనా కాపులంతా ఏకం కావాలని ఆ సామాజికవర్గం కోరుతోంది.

    -ఎన్నం