
దేశ రాజకీయాల్లో అత్యంత పవర్ ఫుల్ రాజకీయ నేతలు ఎవరంటే ఎవరైనా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని చెప్తారు. ఎందుకంటే.. వారు ఒక్కసారి స్కెచ్ వేశారంటే అది అమల్లోకి రావాల్సిందే. అందుకే.. అమిత్‌షాను మోడీకి నీడలా అందరూ అభివర్ణిస్తుంటారు. ఏ విషయాన్ని అమల్లోకి తేవాలన్నా ఇద్దరూ కలిసి డిసైడ్ చేస్తుంటారు. ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవిస్తూనే ఉంటారు. అదే వారి సక్సెస్ ఫార్ములా అయింది. అన్ని సక్సెస్‌లు వారి సొంతం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధాని మోడీ గురించి ఒక కొత్త విషయాల్ని వెల్లడించారు అమిత్ షా.
Also Read: పీఆర్సీ నివేదిక తయారీకి రూ.15కోట్ల వ్యయం..!
దేశంలో ఏ విషయాలు ఎలా ఉన్న. . జమ్ముకశ్మీర్ కు మోడీ ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువన్న విషయాన్ని వెల్లడించారు. తామిద్దరం భేటీ అయిన ప్రతిసారీ కశ్మీర్ కు ఏమేం చేయాలన్న విషయాల గురించి మోడీ ప్రతిసారీ చెబుతుంటారని అమిత్ షా చెప్పారు. ‘నేను మోడీని కలిసిన ప్రతి సందర్భంలోనూ.. జమ్ముకశ్మీర్ లో చేయాల్సిన డెవలప్ మెంట్ గురించి మాట్లాడుతుంటారు. అక్కడి ప్రజల బాగోగులు.. శాంతిభద్రతల గురించి కచ్ఛితంగా ప్రస్తావనకు వస్తుంది. శాంతి లేకుంటే అభివృద్ధి జరగదు. జమ్ముకశ్మీర్‌కు ఇచ్చిన అన్ని హామీలను ప్రధాని మోదీ తప్పనిసరిగా నెరవేరుస్తారు. 2019 ఆగస్టు 5 తర్వాత జమ్ముకశ్మీర్‌లో ప్రతిరంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది’ అని అమిత్ షా చెప్పారు.
Also Read: కొత్త ట్రాఫిక్ రూల్స్.. బండి ఉంటేనే ప్రమాదం.. అమ్మేస్తే పోలా..!
మోడీ ఆరేళ్ల పాలనలో జమ్ముకశ్మీర్ చరిత్రలో అత్యంత శాంతియుతమైన కాలంగా గుర్తుండిపోతుందని షా పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ లో 1990 తర్వాత అత్యంత శాంతియుతమైన కాలంగా నిలుస్తుందన్న ఆయన.. ఆ రాష్ట్ర ప్రజలతో మోడీకి ప్రత్యేక అనుబంధం.. ప్రేమ ఉన్నాయని చెప్పారు. జమ్మూలో ఇటీవల జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు స్వేచ్ఛగా.. పారదర్శకంగా జరిగిన వైనం దేశానికి గర్వకారణమన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొనటం మోడీకి సంతోషాన్ని ఇచ్చినట్లుగా చెప్పారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్