https://oktelugu.com/

మోడీ భారీ ప్రక్షాళన.. కారణాలేంటి?

ప్రధాని నరేంద్ర మోడీ తన మార్కు చూపించారు. మంత్రివర్గ విస్తరణలో పనితీరుకే ప్రాధాన్యత కల్పించారు. పనిచేయని 12 మందిని ఇంటికి సాగనంపారు. బాగా పనిచేసిన ఏడుగురికి పదోన్నతులు ఇచ్చారు. కొత్తగా 36 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో కేంద్ర మంత్రుల సంఖ్య 77కి పెరిగింది. 2019 మే 31న రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని మంత్రివర్గంలో 53 మంది మంత్రులుగా ఉండేవారు. దీంతో మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని కూర్చారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 8, 2021 11:35 am
    Modi cabinet reshuffle
    Follow us on

    Modi Cabinet Reshuffle

    ప్రధాని నరేంద్ర మోడీ తన మార్కు చూపించారు. మంత్రివర్గ విస్తరణలో పనితీరుకే ప్రాధాన్యత కల్పించారు. పనిచేయని 12 మందిని ఇంటికి సాగనంపారు. బాగా పనిచేసిన ఏడుగురికి పదోన్నతులు ఇచ్చారు. కొత్తగా 36 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో కేంద్ర మంత్రుల సంఖ్య 77కి పెరిగింది. 2019 మే 31న రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని మంత్రివర్గంలో 53 మంది మంత్రులుగా ఉండేవారు. దీంతో మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని కూర్చారు. బుధవారం సాయంత్రం రాష్ర్టపతి భవన్ దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ 43 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు.

    సరిగా పనిచేయని 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. వారిలో సీనియర్ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్, రమేశ్ పోబ్రియాల్ తో పాటు సదానంద గౌడ, సంతోష్ గంగ్వార్, దేబశ్రీ చౌదురి, బాబుల్ సుప్రియో, విద్యాశాఖ మంత్రి సంజయ్ దోత్రే, జలశక్తి సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా ఉన్నారు. కర్ణాటక గవర్నర్ గా నియమితులైన సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి ధావర్ చంద్ గహ్లోత్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.

    మంత్రుల పనితీరుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని కార్యాలయం మంత్రుల కదలికలను గుర్తించి వారికి మార్కులు వేశారు. దీంతో వారిని పక్కకు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రుల పనితీరును సమీక్షించారు.2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్యకు కేబినెట్ బెర్త్ లభించింది.

    మంత్రుల్లో ఓబీసీలు 27, ఎస్పీలు 12, ఎస్టీలు 8, మైనార్టీలు 5 ఉన్నారు. మిగిలిన 25 మంది వివిధ సామాజిక వర్గాల వారున్నారు. నలుగురు సీఎంలుగా పనిచేసిన నేపథ్యం ఉంది. కేబినెట్ లో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. 15 మందికి కేబినెట్ హోదా, 28 మందికి సహాయ మంత్రుల హోదా అప్పగించారు. కొత్త మంత్రుల్లో 33 మంది లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా 8 మంది రాజ్యసభ నుంచి వచ్చారు.