
టీమ్ ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచకప్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేస్తాడని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నారు. ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీసులో అతడు భారీ స్థాయిలో పరుగులు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లిష్ పిచ్ లపై అతడి బ్యాటింగ్ టెక్నిక్ ను చక్కగా మార్చుకున్నాడని వెల్లడించాడు. ఈ రెండేళ్లో అతడు మరింత అనుభవం సంపాదించాడు. ఈ టెస్టు సిరీసులో అతడు అలాంటి ప్రదర్శనే పునరావృతం చేస్తే నాకేమీ ఆశ్చర్యం లేదు అని గావస్కర్ అన్నాడు.