కరోనా డెల్టా వేరియంట్ షేక్ చేస్తుందా?

అగ్రరాజ్యం అమెరికాను కరోనా డెల్టా వేరియంట్ షేక్ చేయడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) నుంచి వచ్చిన కొత్త అంచనాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంతవేగంతో వ్యాపిస్తున్న డెల్టా రకం కరోనా మహమ్మారి అమెరికాలో అల్ఫా రకం వేరియంట్ ను అధిగమించి మరీ అమెరికాలో అత్యధిక కేసులు నమోదు చేస్తోందట.. భారతదేశంలో వినాశనం సృష్టించిన ఈ డెల్టా రకం వైరస్ ఇప్పుడు 100కు పైగా దేశాలకు వ్యాపించింది. […]

Written By: NARESH, Updated On : July 8, 2021 11:32 am
Follow us on

అగ్రరాజ్యం అమెరికాను కరోనా డెల్టా వేరియంట్ షేక్ చేయడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) నుంచి వచ్చిన కొత్త అంచనాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంతవేగంతో వ్యాపిస్తున్న డెల్టా రకం కరోనా మహమ్మారి అమెరికాలో అల్ఫా రకం వేరియంట్ ను అధిగమించి మరీ అమెరికాలో అత్యధిక కేసులు నమోదు చేస్తోందట..

భారతదేశంలో వినాశనం సృష్టించిన ఈ డెల్టా రకం వైరస్ ఇప్పుడు 100కు పైగా దేశాలకు వ్యాపించింది. జూలై 3తో ముగిసిన రెండు వారాల్లో అమెరికాలో 51.7శాతం కొత్త అంటు వ్యాధులకు కారణం అవుతుందని సీడీసీ తెలిపింది.

బ్రిటన్ దేశంలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ఈ ‘ఆల్ఫా’ వైరస్ వలన సంభవించిన కొత్త కేసుల నిష్ఫత్తి కేవలం 28.7శాతం మాత్రమే ఉంది. కానీ డెల్టా వ్యాప్తి 51.7శాతంగా ఉండడం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోందని సీడీసీ తెలిపింది.

డెల్టా వేరియంట్ ఇప్పుడు అమెరికాలో అత్యధిక కేసులకు కారణమై ఆధిపత్య వేరియంట్ గా అవతరిస్తోందని ఆరోగ్య అధికారులు, నిపుణులు హెచ్చరించారు. దేశంలో దాని ప్రాబల్యం ప్రతి రెండు వారాలకు రెట్టింపు అవుతోందని చెబుతున్నారు. కొత్త కేసుల పెరుగుదలకు ఈ వైరస్ కారణమవుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు ప్రాణాలకే ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ వ్యాక్సిన్లు వేసిన అలబామా, అర్కాన్సాస్, లూసియానా , మిసిసిపీలతో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని సీడీసీ తెలిపింది.

డెల్టా అత్యంత ప్రమాదకర ప్రాణాలు తీసే కరోనా అంటు వ్యాధి అయినప్పటికీ దాని నుంచి ప్రాణాపాయం లేకుండా కాపాడేసామర్థ్యం టీకాలకు ఉందని.. వాటిని వేసుకోవాలని ప్రజలకు పరిశోధకులు సూచిస్తున్నారు. డెల్టా నుంచి రక్షణ పొందడానికి అమెరికన్లు అంతా టీకాలు వేసుకోవాలని అధ్యక్షుడు పిలుపునిచ్చాడు. అమెరికా జనాభాలో 47.6శాతం మంది కోవిడ్ 19 టీకాలు వేసుకున్నారు. జనాభాలో 55.1శాతం మందికి బుధవారం నాటికి కనీసం ఒక డోసు అయినా లభించిందని సీడీసీ తెలిపింది.