https://oktelugu.com/

రాఘవ లారెన్స్ మరోసారి ఆర్ధిక సాయం

కేరళ లోని తిరువనంతపురంలోని N I M S వైద్యశాలలో తమిళనాడుకు చెందిన అశోక్ అనే పాత్రికేయుడు తల్లి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. కాగా పాత్రికేయుడు అశోక్ తన తల్లిని తమ స్వస్థల మైన కన్యాకుమారి కి చేర్చేందుకు సహకరించాలని రాఘవ లారెన్స్ ని కోరడం జరిగింది . దానికి స్పందించిన రాఘవ లారెన్స్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ని ఆ విషయం లో సాయం కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ […]

Written By:
  • admin
  • , Updated On : May 11, 2020 / 11:14 AM IST
    Follow us on

    కేరళ లోని తిరువనంతపురంలోని N I M S వైద్యశాలలో తమిళనాడుకు చెందిన అశోక్ అనే పాత్రికేయుడు తల్లి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. కాగా పాత్రికేయుడు అశోక్ తన తల్లిని తమ స్వస్థల మైన కన్యాకుమారి కి చేర్చేందుకు సహకరించాలని రాఘవ లారెన్స్ ని కోరడం జరిగింది . దానికి స్పందించిన రాఘవ లారెన్స్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ని ఆ విషయం లో సాయం కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ కూడా రాసాడట …..

    అంతేకాదు ఆ క్రమంలో వైద్యశాలకు చెల్లించాల్సిన లక్షన్నర రూపాయలను చెల్లించే స్థితిలో ఆ పేద పాత్రికేయుడు అశోక్ లేడు కాబట్టి కన్యాకుమారిలోని అతడి స్వస్థలానికి ఆమె భౌతిక కాయాన్ని పంపే ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. .అంతేకాదు అశోక్ చెల్లించాల్సిన లక్షన్నర రూపాయల మొత్తాన్ని ఒకటి రెండు రోజుల్లో తానే చెల్లిస్తానని ఆ లేఖలో పేర్కొన్నాడట… ఈ సందర్భంగా కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన రాఘవ లారెన్స్.. తన తల్లితో వచ్చి ఇటీవల కేరళ సీఎంను కలిసి కరోనా సహాయనిధిని అందించిన విషయాన్ని గుర్తు చేసుకొన్నారు. .