ప్రధాని నరేంద్రమోడి జాతీనుద్దేశించి ప్రసంగించారు. 4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని, ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని మోడి చెప్పారు. ప్రపంచం ఇంతకు ముందెన్నడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనలేదని మోడీ అన్నారు.
కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాలి. కరోనాకు ముందు కరోనా తర్వాత అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌లో కూడా అనేకమంది అయినవారిని కోల్పోయారు.
ఒకే ఒక్క వైరస్ మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తుందన్న ఆయన యావత్ ప్రపంచం ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతోందన్నారు. ఓడిపోవడం మానవాళి అంగీకరించదన్నారు. ఇది కీలక సమయం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.
కరోనాకు ముందు వరకూ దేశంలో పీపీఈ కిట్ల తయారీ లేదనీ, కానీ అవసరం మనను ముందుకు నడిపించిందన్నారు. ఇప్పుడు రోజుకు 2 లక్షల చొప్పున పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్ ల తయారీ మొదలైనట్లు ప్రధాని తెలిపారు. ప్రాణాలు కాపాడుకుంటూనే, కరోనాతో పోరాడుతూనే ముందుకు సాగాల్సిన తరుణమిదని మోడీ చెప్పారు.