ఏపీ కొత్త జీవోపై తెలంగాణ బీజేపీ దీక్ష!

తెలుగురాష్ట్రాల మధ్య పోతురెడ్డిపాడు జీవో వివాదం రేపుతోంది. పోతురెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ జగన్ ప్రభుత్వం కొత్త జీఓ( 203)ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ సర్కార్ ఆ జీవోను ఎందుకు ఖండించడంలేదని అసహనం వ్యక్తం చేస్తుంది. నీళ్లు-నిధులు-నియామకాలే లక్ష్యంగా కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది జలాల దోపిడిని అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. జీఓ నంబరు 203ను రద్దు చేసేలా […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 8:53 am
Follow us on

తెలుగురాష్ట్రాల మధ్య పోతురెడ్డిపాడు జీవో వివాదం రేపుతోంది. పోతురెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ జగన్ ప్రభుత్వం కొత్త జీఓ( 203)ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ సర్కార్ ఆ జీవోను ఎందుకు ఖండించడంలేదని అసహనం వ్యక్తం చేస్తుంది. నీళ్లు-నిధులు-నియామకాలే లక్ష్యంగా కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది జలాల దోపిడిని అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. జీఓ నంబరు 203ను రద్దు చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్, కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తే నేడు బీజేపీ నేతలు దీక్ష చేపట్టనున్నారు. హైదరాబాద్‌ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దీక్ష చేపట్టనున్నారు. ఈయనకు తోడుగా ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకుచెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లలోనే నిరసన దీక్షకు దిగనున్నారు. ఏపీ ప్రభుత్వ జీఓపై బీజీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. అపరభగీరథుడిగా తన వందిమాగధుల చేత పొగిడించుకున్న సీఎ కేసీఆర్ పోతురెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నా.. జగన్ ప్రభుత్వంపై ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

ఇదే విషయంపై ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణకి అన్యాయం చేయకుండా వరదల ద్వారా వచ్చి, సముద్రంలో కలిసిపోయె నీటిని మాత్రమే మా ప్రభుత్వం వాడుకోవలనుకుంటుదని ఆయన తెలిపారు. ఇదే విషయం పై ఏపీ బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల తరఫున పోతురెడ్డి పాడు విషయంలో ముందడుగు వేయాలని సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జగన్మోహన్ రెడ్డి కి అన్ని పార్టీలు సమర్థంచాలని ఇతర పార్టీలకు విజ్నప్తిని చేస్తున్నాను అన్నారు.